NCRB Report: పసికందుల్ని రోడ్డు మీద వదిలేసిన నగరాల్లో టాప్‌ప్లేస్‌‌లో దేశరాజధాని.. షాకింగ్ విషయాలు

|

Dec 27, 2021 | 5:00 PM

NCRB Report: రోజు రోజుకీ మానవత్వం మంటగలుస్తోంది.. అన్ని బంధాలతో పాటు పేగు బంధం కూడా బలహీనపడింది అనడానికి సాక్ష్యంగా అనేక సంఘటనలు నిలుస్తున్నాయి. కన్న ప్రేమని మరచి కళ్ళు తెరవని పసి కందులను..

NCRB Report: పసికందుల్ని రోడ్డు మీద వదిలేసిన నగరాల్లో టాప్‌ప్లేస్‌‌లో దేశరాజధాని.. షాకింగ్ విషయాలు
7 – బాంబే హైకోర్టు ఆగస్ట్ 27న 20 ఏళ్ల మహిళ తన 33 వారాల పిండానికి తీవ్రమైన నాడీ సంబంధిత, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నందున దానిని తొలగించేందుకు అనుమతించింది. పిండంలోని శిశువు అనారోగ్యంతో ఉన్న కారణంగా వైద్య నివేదిక ఆధారంగా ముంబై బెంచ్ JJ ఆసుపత్రిలో అవాషన్ కు అనుమతించింది.
Follow us on

NCRB Report: రోజు రోజుకీ మానవత్వం మంటగలుస్తోంది.. అన్ని బంధాలతో పాటు పేగు బంధం కూడా బలహీనపడింది అనడానికి సాక్ష్యంగా అనేక సంఘటనలు నిలుస్తున్నాయి. కన్న ప్రేమని మరచి కళ్ళు తెరవని పసి కందులను సైతం రోడ్డుపక్కన వదిలేస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఇటువంటి సంఘటనల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం దీనికి ముఖ్య కారణం పేదరికంతో కొందరు..  ఆడపిల్ల పుడితే.. పెంచలేమని.. కట్న కానుకలను ఇచ్చి పెళ్లి చేయలేమని ఇంకొందరు వదిలేస్తుంటే.. మరికొందరు సమాజం హర్షించేలా నడచుకోలేదు.. తమ పరువు తక్కువ అంటూ శిశువులను అనాధల్లా రోడ్డుమీద వదిలేస్తున్నారు. అయితే ఇటీవల దేశంలో పసికందుల్ని రోడ్డు మీద వదిలేస్తున్న రాష్ట్రాల విషయంలో ఎన్సీఆర్బీ అధ్యాయం చేసింది. 2015-20 మధ్య క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం దేశంలో 6459 మంది పిల్లల్ని వదిలేశారు.

ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టాప్ 5 నగరాలు: 

ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం పసికందులను అనాధాల్లో రోడ్డు మీద వదిలేస్తున్న నగరాల్లో మొదటి ప్లేస్ లో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఈ ఐదేళ్ళలో ఢిల్లీలో 221 మంది నవజాత శిశువులను రోడ్డు మీద వదిలివేయగా 156 మంది చిన్నారులతో సెకండ్ ప్లేస్ లో బెంగళూరు నిలిచింది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 75మంది చిన్నారులు రోడ్డుమీద వదిలివేయబడ్డారు.  నాలుగు ఐదు స్థానాల్లో అహ్మదాబాద్ ( 75చిన్నారులు), ఇండోర్( 65 చిన్నారులు) నగరాలు నిలిచాయి.

ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టాప్ 5 రాష్ట్రాలు: 

దేశ వ్యాప్తంగా పసికందులు గర్భంలో ఉండగానే చంపేయడం, పసితనంలోనే చంపేయడం, పుట్టిన వెంటనే అనాధల్లా వదిలివేయడం అని కలిపి మహారాష్ట్ర మొదటి ప్లేస్ లో నిలిచింది. 2015-20 మధ్య  మహారాష్ట్రలో 1184మంది పిల్లలు తల్లిదండ్రుల చర్యల వలనస్ తమ జీవితాన్ని కోల్పోయారని ఎన్సీఆర్బీ నివేదిక ద్వారా తెలుస్తోంది.  1168 మంది పసికందులతో సెకండ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ నిలవగా మూడో స్థానంలో 814మంది చిన్నారులతో రాజస్థాన్ నిలిచింది. ఇక నాలుగు ఐదు స్థానాల్లో కర్ణాటక ( 771మంది చిన్నారులు) , గుజరాత్ ( 650మంది చిన్నారులతో) లు నిలిచాయి.

పసి కందుల్ని వదిలేస్తే శిక్షలు ఇవే!

అయితే మనదేశంలో కడుపులోని పిండాన్ని చంపేయడం దగ్గరనుంచి వారిని వదిలివేసిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడానికి అనేక చట్టాలు ఉన్నాయి.. పలు శిక్షలు కూడా విధిస్తారు.

ఐపీసీ సెక్షన్ 317 ప్రకారం 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్ని తల్లితండ్రులు లేదా సంరక్షకులు వదిలేస్తే 7 సంవత్సరాల శిక్షను విధిస్తారు.

ఐపీసీ సెక్షన్ 315, 316 ప్రకారం కడుపులో ఉండగానే శిశువుని చంపేయటం మర్డర్ తో సమానంగా పరిగణిస్తారు. అటువంటి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.

ఐపీసీ సెక్షన్ 315 ప్రకారం బిడ్డ పుట్టకుండా చంపటం కానీ పుట్టిన తర్వాత చంపటం కానీ నేరమే.. అటువంటి వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.

శిశువుని వదిలివేయడానికి ముఖ్యకారణాలు: 

నేటి సమాజంలో  అసమానాలతో పాటు పేదరికం కూడా ఓ ముఖ్య కారణంగా నిలుస్తోంది. అంతేకాదు ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లను భారంగా భావిస్తున్నారు. పెళ్లి కాకుండానే పిల్లలు పుట్టటం వంటి కారణాలకు కూడా పసికందులను రోడ్డుపాలు చేస్తున్నారు.

Also Read:  ఏపీ సర్కార్‌కు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ.. జీవో 53, 54లు కొట్టివేత..