ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది సీబీఐ. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జైల్లోనే కవిత విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపింది. అయినప్పటికీ కవిత విచారణకు హాజరుకాకపోవడంతో జైల్లోనే కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సీబీఐ.
గడిచిన 20 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత తన 16 ఏళ్ల కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్‌ను అనుమతి ఇవ్వాలని గురువారం కోర్టును కోరారు. ఇదే క్రమంలో ఈడీ, సీబీఐ కేసులతో ప్రమేయం ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఢిల్లీ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8కు వాయిదా వేసింది. సోమవారం ఉదయం 10.30కి కవితను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కవితను విచారించేందుకు సీబీఐ ఏజెన్సీకి అనుమతి ఇవ్వగా మధ్యంతర బెయిల్‌పై ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..