దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర జెడ్పీ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ఇంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరురుగు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఏడుగురిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించారు. భవనం నుండి ప్రజలను ఖాళీ చేయించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చాలా మంది అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది.
గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా మూడో అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని, వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. మూడు ఫ్లోర్లను దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. పరిస్థితి అస్పష్టంగా మారింది. మొదటి అంతస్తులో ఉంటున్న ఉక్కు వ్యాపారి సుభాష్ జైన్ ఇంట్లో మంటలు చెలరేగినట్టుగా గుర్తించారు.
#WATCH | Delhi | Three people died in a fire that broke out at a house in Pitampura area this evening. A total of 8 fire tenders were rushed to the spot and fire was brought under control. Search continues. pic.twitter.com/KgdXyhLnbR
— ANI (@ANI) January 18, 2024
పితాంపురలోని జెడ్‌పి బ్లాక్‌లో అగ్నిప్రమాదం గురించి రాత్రి 8 గంటలకు కాల్ రావడంతో ఎనిమిది ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పిలిపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..