మళ్ళీ సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న హస్తిన…. ఢిల్లీలో 89 కోవిద్ కేసులు…. వారంలో మూడో సారి

ఢిల్లీలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి . గత 24 గంటల్లో 89 కోవిద్ కేసులు నమోదయ్యాయి. వారంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మూడోసారి అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మళ్ళీ సాధారణ  పరిస్థితికి చేరుకుంటున్న హస్తిన.... ఢిల్లీలో  89 కోవిద్ కేసులు.... వారంలో మూడో సారి
Arvind Kejriwal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 27, 2021 | 11:13 PM

ఢిల్లీలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి . గత 24 గంటల్లో 89 కోవిద్ కేసులు నమోదయ్యాయి. వారంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మూడోసారి అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ కథనం ప్రకారం..ఐసిఎంఆర్ పోర్టల్ లో గత వారం రోజుల నుంచి తీహార్ జైలుకు సంబంధించి 170 కేసులు నమోదైనట్టు తెలిసింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 14, 33, 934 గా ఉందని, 24, 665 మంది రోగులు మరణించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న 285 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 98.14 శాతం ఉండగా మార్చి నెల తరువాత యాక్టివ్ కేసులు 1568 వరకు ఉన్నట్టు తెలిసింది. ఇక టెస్టుల విషయానికి వస్తే 24 గంటల్లో 54 వేలకు పైగా ఆర్ టీ పీ సి ఆర్ టెస్టులు నిర్వహించారు. ఇవి గాక సాధారణ టెస్టులను 74 వేల వరకు నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రేపటి నుంచి జిమ్ లు, యోగా సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయని వారు చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిద్ ప్రొటొకాల్స్ మాత్రం పాటించవలసిందేనని వారన్నారు.

అటు ఢిల్లీలో నిన్న రెండు లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ప్రతి రోజూ సుమారు లక్షన్నర మందికి పైగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. రానున్న నెలలో నగరానికి 45 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశామని ఆయన చెప్పారు. వవ్యాక్సిన్ కొరత ఇంకా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Realme Narzo 30 Features: రియ‌ల్‌మీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. ఆక‌ట్టుకుంటోన్న‌ ఫీచ‌ర్ల‌పై మీరూ ఓ లుక్కేయండి..

Minister Harish Rao: రైతు అవతారం ఎత్తిన మంత్రి హరీష్ రావు.. స్వయంగా పొలంలో దిగి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!