NEET Exam: వామ్మో ఇదెక్కడి మోసం.. రూ.7 లక్షలిస్తే నీట్ పరీక్ష రాసిపెడుతున్నారు.
దేశంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో ఓ భారీ మోసం వెలుగుచూసింది. ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించేందుకు అసలైన విద్యార్థులతో కాకుండా నకిలీ వాళ్లతో ఓ ముఠా సభ్యులు పరీక్షలు రాయిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ విద్యార్థులు రహస్యంగా నడిపిస్తున్న ఈ దందాను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.
దేశంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో ఓ భారీ మోసం వెలుగుచూసింది. ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించేందుకు అసలైన విద్యార్థులతో కాకుండా నకిలీ వాళ్లతో ఓ ముఠా సభ్యులు పరీక్షలు రాయిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ విద్యార్థులు రహస్యంగా నడిపిస్తున్న ఈ దందాను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ ఎయిమ్స్‌లోని రేడియాలజీ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్ బిశ్రోయ్ అనే వ్యక్తి ఈ నీట్ పరీక్ష రాకెట్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత డబ్బులు ఆశ చూపి చాలామంది ఎయిమ్స్ విద్యార్థులను తన ముఠా సభ్యులుగా చేర్చుకున్నాడు. ఎక్కువగా ఎయిమ్స్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో వేరే విద్యార్థుల తరపున పరీక్షలు రాయించేవాడు.
అయితే ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో నరేష్ ముఠాకు చెందిన వారు ఇతర అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తూ అధికారులకు దొరికిపోయారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తమదైన శైలీలో విచారించగా అసలు విషయం బయటపడింది. మొత్తానికి ఈ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను నడిపిస్తున్న నాయకుడు నరేష్ బిశ్రోతో పాటు నలుగురు విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడు రెండో సంవత్సరం పరీక్షలు రాస్తుండగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే నకిలీ అభ్యర్థులతో ప్రవేశ పరీక్షలు రాయించేందుకు ఈ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి దాదాపు 7 లక్షల వరకు డబ్బులు తీసుకుందని పోలీసుల విచారణలో తెలిసింది. ముందుగా లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకొని.. పరీక్ష రాయడం పూర్తయ్యాక మిగతా 6 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం