Delhi CM Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుని మోసం చేసి రూ. 34వేలు కాజేసిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ కామర్స్ సైట్లలో నకిలీ ఖాతాలు పొందుపరిచే ప్రధాని నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 7వ తేదీన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురు ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ సోఫాను విక్రయానికి పెట్టారు. అయితే ఓ వ్యక్తి దానిని కొంటానంటూ ముందుకువచ్చాడు.
ఆ క్రమంలో ఆమెను నమ్మించేందుకు ముందుగా ఆమె ఖాతాలోకి కొంత సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తరువాత బార్‌కోడ్ స్కాన్ చేయమని కోరగా.. వారిని నమ్మిని సీఎం కూతురు బార్‌కోడ్‌ను స్కాన్ చేసింది. దాంతో ఆమె ఖాతా నుంచి రెండు విడతలుగా రూ. 20,000, 14,000 చొప్పున కట్ అయ్యాయి. ఈ కేటుగాళ్ల మోసాన్ని గ్రహించిన సీఎం కూతరు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
CM Kejriwal Daughter
Also read:
Tipping in New York: తనకు సర్వ్ చేసిన వెయిట్రెస్ కు దాదాపు రూ. 9 లక్షల టిప్ .. ఎక్కడంటే..!
IND vs ENG 2nd Test: ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ కోహ్లీ, అశ్విన్.. లంచ్ బ్రేక్ సమయానికి..