Shraddha Murder Case: అడవిలో దొరికిన శ్రద్ధ దవడ ముక్క.. శ్రద్ధను ద్వేషిస్తున్నానని చెప్పిన అఫ్తాబ్.. ఆధారాలను ధ్వంసం చేసినట్లు వెలుగులోకి..

|

Nov 20, 2022 | 2:47 PM

పోలీసుల ఇంటరాగేషన్‌లో అఫ్తాబ్ తాను శ్రద్ధను ద్వేషిస్తున్నానని .. హత్య చేసిన ఐదు రోజుల తర్వాత అంటే మే 23న ఇంట్లోని శ్రద్ధకు చెందిన  ప్రతి వస్తువును సోదా చేసినట్లు  చెప్పాడు.

Shraddha Murder Case: అడవిలో దొరికిన శ్రద్ధ దవడ ముక్క.. శ్రద్ధను ద్వేషిస్తున్నానని చెప్పిన అఫ్తాబ్.. ఆధారాలను ధ్వంసం చేసినట్లు వెలుగులోకి..
Shraddha Murder Case
Follow us on

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..  అఫ్తాబ్ చెప్పిన స్థలంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ అడవి నుండి దవడ ముక్కలతో పాటు ఎముకలు కూడా దొరికాయి. ఈ ఎముకలను శ్రద్ధా శరీరానికి చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎముకలు తలలో భాగం , దవడలో భాగంగా కనిపిస్తాయి. వీటిని ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు ఈరోజు ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ శ్రద్ధ నివసించిన ఛతర్‌పూర్ ఇంటికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు వెతికిన తర్వాత పోలీసులకు మరికొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. క్లూస్ సేకరించిన పోలీసులు వాటిని రెండు నల్ల బ్యాగుల్లో పెట్టుకుని తమ వెంట తీసుకుని వెళ్ళినట్లు సమాచారం.

పోలీసుల ఇంటరాగేషన్‌లో అఫ్తాబ్ తాను శ్రద్ధను ద్వేషిస్తున్నానని .. హత్య చేసిన ఐదు రోజుల తర్వాత అంటే మే 23న ఇంట్లోని శ్రద్ధకు చెందిన  ప్రతి వస్తువును సోదా చేసినట్లు  చెప్పాడు. ఆ సమయంలో తనకు శ్రద్ధకు సంబంధించి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును వెతికినట్లు.. వాటిని నాశనం తాను చేయాలని భావించినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. బెడ్ రూమ్ లో శ్రద్ధ మూడు ఫోటో లు ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్ పర్యటన సమయంలో శ్రద్ధా ఒక్కత్తే తీసుకున్న ఫోటో ఒకటి,  రెండూ 2020లో ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్నవి ఉన్నాయని తెలిపాడు

తాను మొదట మూడు ఫోటోల ఫ్రేమ్‌లను పగలగొట్టి, ఆపై వంటగదిలో అగ్గిపెట్టెల నిప్పంటించి మూడు ఫోటోలను కాల్చినట్లు అఫ్తాబ్ చెప్పాడు. శ్రద్ధకు సంబంధించిన ప్రతి సాక్ష్యాలను చెరిపివేయాలనుకున్నానని అఫ్తాబ్ చెప్పాడు. మే 23న ఇంట్లో ఉన్న శ్రద్ధ వస్తువులను బ్యాగ్‌లో నింపాడు.. అందులో బట్టలు, బూట్లు మొదలైనవి ఉన్నాయి. ఈ బ్యాగ్‌ని కూడా పోలీసులు ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఈ రోజు పోలీసు బృందం క్రైమ్ స్పాట్‌కు చేరుకుంది. అక్కడ పోలీసులు అఫ్తాబ్ శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా ఎలా నరికాడో తెలుసుకోవడానికి సన్నివేశాన్ని పునఃసృష్టిస్తారు.

ఇవి కూడా చదవండి

గురుగ్రామ్ వెళ్లిన పోలీసులు
సాక్ష్యాధారాల అన్వేషణలో.. వరుసగా ఆరో రోజు పోలీసు బృందం మెహ్రౌలీ అడవులను శోధించింది. శ్రద్ధా స్నేహితురాళ్లతో పాటు గాడ్విన్, రాహుల్ రాయ్‌లను విచారించారు. హర్యానాలోని గురుగ్రామ్‌కు కూడా ఓ పోలీసు బృందం వెళ్లింది. పోలీసులు తమ వెంట మెటల్ డిటెక్టర్‌ను కూడా తీసుకెళ్లారు. శ్రద్ధా మృతదేహాన్ని కట్ చేసేందుకు అఫ్తాబ్ ఉపయోగించిన ఆయుధాన్ని ఇక్కడే ఎక్కడో విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..