
మొన్నటివరకు మాడు పగిలిపోయే ఎండలు, ఇప్పుడు గుండెలదిరిపోయేలా గాలివాన. దేశ రాజధాని ఢిల్లీలో లేటెస్ట్ సిట్యువేషన్ ఇది. అవును, గాలివాన బీభత్సానికి ఢిల్లీ వణికిపోతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న ఈదురుగాలులు ఢిల్లీ విలవిల్లాడుతోంది. ఢిల్లీలో మరోసారి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల బీభత్సానికి ఢిల్లీ అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయ్. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. గాలివాన సృష్టించిన బీభత్సానికి ఢిల్లీలో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. దాంతో, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాలి వాన బీభత్సానికి ఏపీ భవన్‌లో చెట్లు విరిగిపడ్డాయి. ఏపీ భవన్ అద్దాలు పగిలి మీద పడటంతో టీవీ9 డ్రైవర్ గాయపడ్డాడు. ఏపీ భవన్ చుట్టూ ఎటుచూసినా విధ్వంసమే కనిపించింది. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలైతే నీట మునిగాయి.
#WATCH | Delhi: Installed air conditioners fell down a building in Parliament Street area, trees uprooted and fell on cars and autorickshaws in the heavy rain and thunderstorm earlier this evening. pic.twitter.com/Hvjr4h4ES9
— ANI (@ANI) May 30, 2022
రెండు మూడ్రోజులుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. వెదర్ కండీషన్ అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.
#WATCH | Delhi: Heavy rain and thunderstorm topples the canopy at Vijay Chowk. pic.twitter.com/u5sogqiqNT
— ANI (@ANI) May 30, 2022
మరో రెండు మూడ్రోజులపాటు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుందని, ప్రజలు అలర్ట్ ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ.