Delhi Minister Satyendar Jain: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో సోమవారం ఆయన్ను ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించారు. ఛాతీలో నొప్పి, వెన్నునొప్పితో ఆయన్ను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. కాగా.. కస్టడీలో ఉన్న 57ఏళ్ల సత్యేంద్ర జైన్ ను మొదట తీహార్ జైలు నుంచి జీబీ పంత్ వైద్యశాలకు తీసుకురాగా.. అక్కడినుంచి ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో.. ఈడీ అధికారులు మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
2015 – 16 సమయంలో హవాలా ద్వారా ఆయన కంపెనీలకు, షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్ జైన్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆయన్ను అరెస్టు చేసి పలు చోట్ల దాడులను నిర్వహించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటీవల ఆయన బెయిల్ కోసం సంప్రదించగా.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను నిరాకరించింది. జైన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న స్పెషల్ కోర్టు.. తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..