Rajkumar Anand: ఢిల్లీ ఆప్ సర్కార్‌లో మరో సంచలనం.. మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా
ఢిల్లీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ఇంకా స్వీకరించలేదు. ఈ విషయాన్ని ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. ఆయన రాజీనామాను స్పీకర్ కార్యాలయం అధికారికంగా ఆమోదించలేదు. ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేయడంతోపాటు పార్టీని కూడా వీడటం గమనార్హం.
ఢిల్లీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ఇంకా స్వీకరించలేదు. ఈ విషయాన్ని ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. ఆయన రాజీనామాను స్పీకర్ కార్యాలయం అధికారికంగా ఆమోదించలేదు. ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేయడంతోపాటు పార్టీని కూడా వీడటం గమనార్హం. సాంఘిక సంక్షేమ శాఖతోపాటు వివిధ శాఖలు నిర్వహిస్తున్న ఆనంద్.. దళితులకు పార్టీలో ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపించారు.
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళిత ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను, మంత్రులను ఈ పార్టీ గౌరవించదని సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులంతా మోసపోయినట్లు భావిస్తున్నారు. సమ్మిళిత సమాజంలో జీవిస్తున్నాం, కానీ నిష్పత్తి గురించి మాట్లాడటం తప్పు కాదన్నారు. వీటన్నింటితో పార్టీలో కొనసాగడం కష్టం. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని రాజ్ కుమార్ ఆనంద్ ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పార్టీని నాశనం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది అమ్ ఆద్మీ పార్టీ. తమ మంత్రులు, ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. మంత్రి రాజీనామా తర్వాత AAP అవినీతి మయం అయ్యిందనడానికి మంత్రి రాజీనామానే నిదర్శనమని, మొత్తం పార్టీ మాఫియాలతో కలిసి ఎలా దోపిడీ చేస్తుందో బహిర్గతం చేసిందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి దిగింది.
ఢిల్లీలోని పటేల్ నగర్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్, కేజ్రీవాల్ ప్రభుత్వంలో పలు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ‘రాజకీయాలు మారిన వెంటనే దేశం మారిపోతుందని అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వేదికగా పిలుపునిచ్చారు. రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నాయకులు మాత్రం మారారు’ అని రాజీనామా చేసే సమయంలో రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..