Delhi Metro: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్

|

Feb 07, 2024 | 3:44 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (ఫిబ్రవరి 7) ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో రాష్ట్రపతి ముర్ము మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది...

Delhi Metro: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్
President Draupadi Murmu Traveled In Delhi Metro
Follow us on

ఢిల్లీ, ఫిబ్రవరి 7: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (ఫిబ్రవరి 7) ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో రాష్ట్రపతి ముర్ము మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పసుపు రంగు చీర, మస్టర్డ్ కలర్ స్వెటర్ ధరించి కనిపించారు. రాష్ట్రపతి ముర్ము మెట్రో రైల్లోని సీటుపై కూర్చుని అధికారులతో నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తుంది. ముర్ము ముందు సీట్లో మరో వ్యక్తి కూర్చుని ఆమె ఫోటో తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన సెక్యూరిటీ గార్డులతో కలిసి ఈ వీడియోలో కనిపించారు. ముర్ము చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా అధికారులు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు నిలబడి ఉన్నారు. మెట్రో నిర్వహణ, కార్యకలాపాల గురించి డీఎంఆర్‌సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అలాగే ఆమె మెట్రో అధికారులను కూడా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ ప్రజల రోజువారీ అనుభవాలను తెలుసుకునేందుకు రాష్ట్రపతి ముర్ము ఈ మేరకు మెట్రోలో ప్రయాణించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రనతి ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ముందు భారీ భద్రత మధ్య సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం డీఎంఆర్‌సీ అధికారుల నుంచి మెట్రో నిర్వహణపై సమాచారం తెలుసుకుని, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌లోనే మెట్రో ఎక్కి ప్రయాణించారు. మెట్రో లైన్లు, వాటి కార్యకలాపాల గురించిన పూర్తి సమాచారాన్ని మ్యాప్‌ల ద్వారా రాష్ట్రపతికి డీఎంఆర్‌సీ అధికారులు అందించారు. రాజధానిలోని ఏయే ప్రాంతాల్లో మెట్రో కార్యకలాపాలు ఏయే లైన్లలో కొనసాగుతున్నాయో తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే కాలంలో ఎక్కడెక్కడ మెట్రో విస్తరణ జరుగుతుందనే విషయాలు కూడా అధికారులు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.