Vande Bharat Sleeper: వచ్చే నెలనుంచే వందేభారత్ స్లీపర్.. తొలి రైలు ఈ రూట్‌లోనే.!
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని, తొలి రైలును ఢిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి 20 ఏసీ, నాన్-ఏసీ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని, తొలి రైలును ఢిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి 20 ఏసీ, నాన్-ఏసీ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వీటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేశారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలు ఆదా అవుతుంది. తొలి దశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారతీయ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీస్‌లను అందిస్తున్నాయి. త్వరలో వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు సమాచారం. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..