Delhi MCD election result: బీజేపీకి షాక్.. ఢిల్లీ ఎంసీడీ ఉప ఎన్నికల్లో ఆప్ హావా.. ఒక స్థానంలో..

Delhi MCD by-election 2021 result: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదు వార్డుల ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఒక్కస్థానంలో..

Delhi MCD election result: బీజేపీకి షాక్.. ఢిల్లీ ఎంసీడీ ఉప ఎన్నికల్లో ఆప్ హావా.. ఒక స్థానంలో..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 12:28 PM

Delhi MCD by-election 2021 result: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదు వార్డుల ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఒక్కస్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఐదు వార్డుల ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం ఉదయం వెలువడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ ఒక వార్డును దక్కించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో.. ఎంసీడీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి రిఫరెండంగా మారుతాయని పలువురు పేర్కొంటున్నారు. బీజేపీ ఒక ఖాతాను కూడా తెరవలేకపోవడంపై పలువురు రాజకీయ నేతలు బీజేపీకి ఇబ్బందులు మొదలయ్యాయంటూ వెల్లడిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన ఐదు వార్డుల ఓట్ల లెక్కంపులో మొదటి నుంచి నాలుగు వార్డులలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు అధిపత్యంలో కొనసాగారు. షాలీమార్ బాగ్ నార్త్, కల్యాణ్‌పురి, త్రిలోక్‌పురి, రోహిణి-సీ వార్డులలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. చౌహాన్ బాంగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ‘ఆప్’ విజయంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన స్థానం.. అభ్యర్థుల పేర్లు.. షాలీమార్ బాగ్ నార్త్ – సునీతా మిశ్రా కల్యాణ్‌పురి – ధిరేందర్ కుమార్ త్రిలోక్‌పురి ఈస్ట్ – విజయ్ కుమార్ రోహిణి-సీ – రామ్ చందర్ కాంగ్రెస్ గెలుపొందిన స్థానం.. చౌహాన్ బాంగర్‌ – జుబేర్ అహ్మద్ చౌదరి

నాలుగు స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోవడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అభివృద్ధి కోసం మరోసారి తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 ఏళ్ల నుంచి ఢిల్లీ కార్పోరేషన్‌లో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజలు విసుగు చెందారని.. ఇకపై ఎంసీడీలో ఆప్ అధికారం చేపట్టే అవకాశముందని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Also Read: