ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారాడు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు. ఈ స్కామ్‌లో బుచ్చిబాబు కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే దినేష్ అరోరా అప్రూవర్‌గా మారగా.. ఇప్పుడు బుచ్చిబాబు అప్రూవర్‌గా మారడంతో కేసులో సంచలనం నెలకొంది.
బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై ఇద్దరూ కలిసి సౌత్ గ్రూప్‌ను రిప్రజెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ తరఫున మధ్యవర్తిత్వం చేశాడు బుచ్చిబాబు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ సీబీఐ అరెస్ట్ చేయగా.. ఇప్పుడు అతను అప్రూవర్‌గా మారాడు. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ తాజాగా మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 209 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
అయితే, విజయ్, బుచ్చిబాబు అప్రూవర్‌గా మారడంతో కేసు ఏ మలుపు తీసుకునే అవకాశం ఉందోననే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితపై ప్రభావం ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటనేది చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..