Delhi Earthquake Memes: ‘ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే.. ఏడాదంతా చుక్కలు చూపిస్తా’ ఢిల్లీ భూకంపంపై నెట్టింట వైరలవుతున్న మీమ్స్‌

నిజానికి భూకంపం సంభవించిన సమయంలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మునిగిపోవడం వల్ల అసలు భూకంపం తలెత్తిందనే విషయం కూడా అనేక మందికి తెలియదు. అసలు భూకంపం వచ్చిందో తేదో తెసుకునేందుకు..

Delhi Earthquake Memes: ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే.. ఏడాదంతా చుక్కలు చూపిస్తా ఢిల్లీ భూకంపంపై నెట్టింట వైరలవుతున్న మీమ్స్‌
Delhi Earthquake Memes

Updated on: Jan 01, 2023 | 5:12 PM

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం.. శుభాకాంక్షలతో దేశ వ్యాప్తంగా 2023 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలకడం కూడా దాదాపు పూర్తయినట్లే. ఐతే ఆదివారం వేకువజామున ఢిల్లీ, హర్యానాలోని శెరియా, ఝుజ్జర్‌ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం తలెత్తిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. ఈ భూకంపంలో ఎవ్వరూ గాయపడకపోవడం, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి భూకంపం సంభవించిన సమయంలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మునిగిపోవడం వల్ల అసలు భూకంపం తలెత్తిందనే విషయం కూడా అనేక మందికి తెలియదు. అసలు భూకంపం వచ్చిందో తేదో తెసుకునేందుకు మైక్రో-బ్లాగింగ్ సైట్స్‌ తెగవెతికేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఈ రోజు తలెత్తిన భూకంపంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. రకరకాల మీమ్స్‌ పోస్టు చేస్తూ కొత్త ఏడాది ప్రారంభంలో ఎటువంటి ప్రమాదం జరగనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఓ లుక్కేసుకోండి..


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.