Delhi Elections: ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. ఆప్‌, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌.. కొన్ని ప్రాంతాల్లో..

ఢిల్లీలో అంచనాలను మించి పోలింగ్‌ శాతం నమోదవడంతో.. అంచనాల్లో పార్టీలు తలమునకలవుతున్నాయి. 2020 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్‌ నమోదైంది.. 2025లో సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్... గత ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్‌ పెరిగింది.. పెరిగింది అనుకూల ఓటా..? ప్రతికూల ఓటా..? అంటూ పార్టీలు అంచనా వేస్తున్నాయి.

Delhi Elections: ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. ఆప్‌, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌.. కొన్ని ప్రాంతాల్లో..
Delhi Election 2025

Updated on: Feb 05, 2025 | 6:45 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. సాయంత్రం 6గంటలు దాటినా.. క్యూలైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు.. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్‌, జంగ్‌పూర్‌, అకోలా నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లను ఓటు వేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆప్‌ నేతలు ఆరోపించారు. సీలంపూర్‌లో అయితే ఆప్‌ కార్యకర్తలు బుర్ఖా ధరించి దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. పలు నియోజకవర్గాల్లో ఆప్‌, బీజేపీ అభ్యర్ధుల మధ్య టఫ్‌ ఫైట్‌ ఉంది. గెలుపుపై అటు బీజేపీ, ఇటు ఆప్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ఢిల్లీలో అంచనాలను మించి పోలింగ్‌ శాతం నమోదవడంతో.. అంచనాల్లో పార్టీలు తలమునకలవుతున్నాయి. 2020 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్‌ నమోదైంది.. 2025లో సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్… గత ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్‌ పెరిగింది.. పెరిగింది అనుకూల ఓటా..? ప్రతికూల ఓటా..? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంచనావేస్తున్నాయి..

శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుంది. ఇప్పటివరకు ఢిల్లీలో అత్యధికంగా ముస్తఫాబాద్‌లో 66.7 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. కరోల్‌బాగ్‌లో అత్యల్పంగా 47.4 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఢిల్లీలో కోటి 56 మంది ఓటర్లు ఉన్నారు. 700 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చబోతున్నారు.

కాగా.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలయ్యాయి..లైవ్ లో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..