Delhi Election Results 2025: తగ్గేదేలే.. ఒక్కో రాష్ట్రం.. పక్కా విజయం.. అంతటా కమ్మేస్తున్న కమలం
పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రోలెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ లోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది.

ఏ పార్టీ కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆపార్టీనే పుష్ప..పార్టీ ఉంది పుష్ప.. ఎంతవారు గానీ… ప్రజాతీర్పు ముందు శిరసా వహించాల్సిందే… సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగినా… ప్రజాస్వామ్యానికి తలవంచాల్సిందే.. తినగా తినగా తీపి కూడా చేదే…. ఎంతవారు కానీ ప్రజావ్యతిరేక వ్యక్తమైతే…అధికారానికి దూరమే… కానీ అదేంటో ప్రదాని మోదీ విషయంలో ఎంతవారు గానీ…మోదీ చరిష్మా ముందు జీ హుజుర్ అనాల్సిందేనా అన్నట్టుగా మారింది. తినగా తినగా వేప కూడా తీపే అన్నట్టుగా మారింది మోదీ ఇమేజ్. 2014నుంచి అప్రహిత విజయాలతో.. విపక్షాలకు సాధ్యంకాని రికార్డులతో….అసమాన్య వ్యూహాలతో…దూసుకుపోతోంది కమలం. విపక్షాల కంచుకోటలను బద్దలు కొడుతూ.. ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా కమలం జెండా పాతింది మోదీ-షా ద్వయం.. 27ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. సామాన్యుడిగా వచ్చి..అసమాన్యుడిగా ఢిల్లీగద్దెనెక్కి కూర్చున్నమప్లర్‌వాలా కేజ్రీవాల్ అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. 12ఏళ్ల అధికారాన్ని చాయ్‌వాలా మోదీ మట్టికరిపించారు. ఈజన్మలో కాదు..కదా వచ్చే జన్మలో కూడా ఢిల్లీ పీఠంనుంచి ఆప్‌ను దించే దమ్ముందా మోదీ అంటూ ఝీంకరించిన ఆప్ అధినేతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కమలం. నార్త్‌గేట్‌లో బీజేపీకి తిరుగులేదు. కానీ ఢిల్లీ తప్ప…అన్నట్టుగా 27ఏళ్లుగా బీజేపీని దూరం పెడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో కమలానికి జై కొడుతూ…అసెంబ్లీకొచ్చేసరికి ఆప్‌కు ఆదరణ పెంచుతూ వచ్చింది ఢిల్లీ ప్రజానీకం. కానీ ఈసారి హస్తనపై పాగావేయాలని పంతం పట్టిన కమలనాథులు….సరికొత్త వ్యూహాలతో ఆప్‌ను అదను చూసి దెబ్బకొట్టారు. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం,...