AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూటాన్ ప్రధాని ఆదరణ చిరస్మరణీయం.. మోదీ

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే షేరింగ్ తనపట్ల చూపిన ఆదరాన్ని మరువలేనని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లోటే సాదరంగా స్వాగతం పలికారు. అక్కడ మోదీకి అత్యంత ప్రముఖుల కిచ్ఛే గౌరవ వందనం లభించింది. హైడ్రో-పవర్ రంగంలో భారత్-భూటాన్ మధ్య భాగస్వామ్యం మోదీ పర్యటనతో బలోపేతమవుతుందని భావిస్తున్నారు. స్పేస్,ఎడ్యుకేషన్ వంటి రంగాల్లోనూ ఇరు దేశాల […]

భూటాన్ ప్రధాని ఆదరణ చిరస్మరణీయం.. మోదీ
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 7:05 PM

Share

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే షేరింగ్ తనపట్ల చూపిన ఆదరాన్ని మరువలేనని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లోటే సాదరంగా స్వాగతం పలికారు. అక్కడ మోదీకి అత్యంత ప్రముఖుల కిచ్ఛే గౌరవ వందనం లభించింది. హైడ్రో-పవర్ రంగంలో భారత్-భూటాన్ మధ్య భాగస్వామ్యం మోదీ పర్యటనతో బలోపేతమవుతుందని భావిస్తున్నారు. స్పేస్,ఎడ్యుకేషన్ వంటి రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. పారో విమానాశ్రయం నుంచి భూటాన్ రాజధాని థింపూ వరకు దారి పొడవునా అక్కడి విద్యార్థులు, మహిళలు ఉభయ దేశాల జాతీయ పతాకాలను చేతబట్టుకుని మోదీకి స్వాగతం పలికారు. అటు-ఆయనను భూటాన్ ప్రధాని లోటే ప్రశంసలతో ముంచెత్తారు. తమ దేశ 12 వ పంచ వర్ష ప్రణాళిక కోసం ఇండియా రూ. 5 వేల కోట్ల సాయాన్ని అందజేస్తున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత-భూటాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకునేందుకు మోదీ పర్యటన తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఆయన రెండు రోజులపాటు భూటాన్ లో పర్యటించనున్నారు.

అభిషేక్ ఒక్కసారి హిట్టైతే, 7సార్లు విఫలం: పాక్ మాజీ ప్లేయర్
అభిషేక్ ఒక్కసారి హిట్టైతే, 7సార్లు విఫలం: పాక్ మాజీ ప్లేయర్
అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల
అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ?
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ?
కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3 కోట్ల IRCTC ఐడిల బ్లాక్‌..
కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3 కోట్ల IRCTC ఐడిల బ్లాక్‌..
భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
భారతీయ ఇళ్లలో రూ.452 లక్షల కోట్ల బంగారం.. సంచలన నివేదిక!
భారతీయ ఇళ్లలో రూ.452 లక్షల కోట్ల బంగారం.. సంచలన నివేదిక!
టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు
టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు
కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ..మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్
కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ..మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్
భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?