తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో తాను డ్రగ్ చాట్స్ చేసిన విషయం నిజమేనని బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ అంగీకరించింది. శనివారం ఎన్సీబీ విచారణలో ఆమె-2017 లో తను, కరిష్మా డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్ చేశామని వెల్లడించింది. దీపికను అధికారులు సుమారు నాలుగు గంటలకు పైగా విచారించారు. అయితే వారి ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. అలాగే కరిష్మా కూడా తన ‘బాస్’ ధోరణిలోనే వెళ్లిందట. దీపికను ఇంటరాగేట్ చేసేముందు అధికారులు ఆమె సెల్ ఫోన్ ని బయటే పెట్టాలని కోరారట. 2017 లో కోకో క్లబ్ లో జరిగిన పార్టీ గురించి ఎన్సీబీ బృందం ఆమె నుంచి వివరాలు తెలుసుకోగోరినప్పటికీ ఆమె నుంచి సరైన సమాచారాన్ని వారు రాబట్టలేకపోయారు.
కాగా-దీపికా, రణ్ వీర్ సింగ్ శుక్రవారం రాత్రి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో 12 మంది లాయర్లను కలిసి తమ లీగల్ స్ట్రాటిజీ గురించి చర్చించారు.