watching video: ఇ-రిక్షాలో తరలిస్తున్న గుర్తు తెలియని మృతదేహం.. ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌తో రోడ్డుపై వేలాడుతూ..

|

Jan 24, 2023 | 12:08 PM

చలి కారణంగా యువకుడు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watching video: ఇ-రిక్షాలో తరలిస్తున్న గుర్తు తెలియని మృతదేహం.. ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌తో రోడ్డుపై వేలాడుతూ..
E Rickshaw
Follow us on

రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఈ ఆటో రిక్షాలో తరలిస్తున్న దృశ్యం అందరినీ కలచివేస్తుంది. అందిన సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం ఆసుపత్రిలోని అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లో యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని పార్కింగ్‌లో ఆడుకునేందుకు వచ్చిన చిన్నారులు చూశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ-రిక్షా ద్వారా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ-రిక్షాలో మృతదేహాన్ని ఉంచిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.

మృతదేహాన్ని ఈ రిక్షాలో వేసినప్పుడు అతడి తలభాగం బయటకు కనబడుతుండగా, ప్లాస్టిక్‌ కవర్‌ కప్పి ఉంచారు. కాళ్లు కూడా ఆటోలోంచి కిందకు వేళాడుతున్నాయి. ఆటోలోంచి మృతదేహం రోడ్డుకు తాకుతూ పోతుంటే.. వెనుక నుంచి వస్తున్న వాహనదారులు ఇదంతా వీడియో తీశారు. రిక్షాలోంచి మృతదేహం పాదాలు, తలను వేలాడదీసిన వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వివరాల ప్రకారం.. ఆస్పత్రి నుంచి మార్చురీకి దాదాపు 3 కిలో మీటర్ల దూరం ఉంది. ఈ క్రమంలో ఈ-రిక్షా డ్రైవర్ ఎలాగోలా మిగిలిన వాహనాల నుంచి తప్పించుకుని మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లాడు.ఈ-రిక్షాలో వేలాడుతున్న మృతదేహాన్ని చూసి రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చలి కారణంగా యువకుడు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ ఆరోగ్య వ్యవస్థ, పోలీసు పరిపాలన విధానంపై ప్రజలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..