నదుల్లో తేలియాడుతున్న మృత దేహాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రేగిన రగడ, జోక్యం చేసుకోనున్న కేంద్రం

| Edited By: Phani CH

May 12, 2021 | 10:11 PM

గంగ, యమునా నదుల్లో తేలియాడుతున్న వందలాది మృతదేహాలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మధ్య రగడకు కారణమయ్యాయి. బీహార్ లోని బక్సర్ జిల్లాలో, యూపీ లోని హాషిర్ పూర్ జిల్లాలో కోవిద్ రోగులవిగా భావిస్తున్న మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.

నదుల్లో తేలియాడుతున్న మృత దేహాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రేగిన  రగడ, జోక్యం చేసుకోనున్న కేంద్రం
Hundreds Of Dead Bodies Found
Follow us on

గంగ, యమునా నదుల్లో తేలియాడుతున్న వందలాది మృతదేహాలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మధ్య రగడకు కారణమయ్యాయి. బీహార్ లోని బక్సర్ జిల్లాలో, యూపీ లోని హాషిర్ పూర్ జిల్లాలో కోవిద్ రోగులవిగా భావిస్తున్న మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.కాగా దీనిపై బీహార్ మంత్రి సంజయ్ ఝా బుధవారం తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఈ ఉదంతంపై వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలని ఆయన కోరారు. ఈ దర్యాప్తులో తాము కూడా సహకరిస్తామన్నారు.అసలు డెడ్ బాడీలను నదిలోకి విసరివేసే అలవాటు బీహార్ వాసుల్లో లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ మృత దేహాలు చాలా దూరం నుంచి వచ్చినట్టు తెలుస్తోందని, నాలుగైదు రోజుల క్రితం వీటిని నదిలో విసిరివేసి ఉండవచ్చునని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటిని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా ఇదే విషయాన్నీ నిర్ధారించారని ఆయన అన్నారు. సీఎం నితీష్ కుమార్ కూడా ఇలా డెడ్ బాడీలను పవిత్ర నదుల్లో పారవేయ్యడంపై తీవ్ర కలత చెందారని ఝా తెలిపారు.

బక్సర్ జిల్లాలో 71 మృత దేహాలను, యూపీలోని ఘాజీపూర్ లో నది నుంచి 55 డెడ్ బాడీలను వెలికి తీశారు. అటు-బీహార్, యూపీ రాష్ట్రాల అభ్యర్థనపై దర్యాప్తునకు ఆదేశిస్తామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేఖావత్ వెల్లడించారు. దీనిపై ఉభయ రాష్టాలూ కయ్యానికి దిగరాదని అయన కోరారు. నదిలో కొట్టుకువచ్చిన మృతదేహాలపై ఒక్క బీజేపీ నేత కూడా స్పంధించడంలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Xiaomi: బిల్ గేట్స్ విడాకుల విషయాన్ని ఎగతాళి చేస్తూ షియోమి కంపెనీ చెత్త ట్వీట్..ఏకి పారేస్తున్న జనాలు!

మధ్యప్రదేశ్ లో 50 బ్లాక్ ఫంగస్ కేసులు, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆందోళన, అదుపునకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటన