భర్తే సర్వసం..! పతియే ప్రత్యక్ష దైవం..! కట్టుకున్న వాడు తిట్టినా, కొట్టినా..వివాహమైన మహిళకు సర్వసం తన భర్తేనని అని హిందూ పురాణాలు చెబుతాయి. అలాంటి భర్త ప్రమాదవశాత్తూ చనిపోతే, ఇక తానూ కూడా దేహం చాలించాలని ప్రాచీన కాలంలో మహిళలు భావించేవారు. దానినే సతీసహగమనం అనేవారు. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. కానీ.. ఈ ఆధునిక కాలంలోనూ ఓ మహిళ తన భర్త చనిపోవడంతో, ఆమె కూడా భర్తతోపాటు చితిపై దేహం చాలించాలని భావించింది. అయితే ఈ ప్రయత్నాన్ని కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. లేటెస్ట్‌గా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.
దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసే ఎందరో అమరవీరులను చూస్తూనే ఉంటాం. ఆ జవాను మరణంతో అతడ్ని నమ్ముకున్న కుటుంబానికి మాత్రం ఆ సైనికుడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. వారి గుండెకోతను ఎవరూ తగ్గించలేరు. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడలో ఇటీవల మావోయిస్టుల దాడిలో 11మంది బలయ్యారు. వారిలో మడకం లఖ్ము అనే గిరజన సైనికుడు ఉన్నాడు. దంతేవాడజిల్లా రిజర్వ్‌గార్డ్‌లో మావోయిస్టు తిరుగుబాటుకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతూ వస్తున్నాడు మడకం లఖ్ము. ఈనెల 26న జరిగిన మావోయిస్టుల దాడిలో చనిపోయిన మడకం లఖ్ము అంత్యక్రియలు 27వ తేదీన స్వగ్రామంలో జరిగాయి. మడకం లఖ్ము వీరమరణంతో సొంతూరితోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా వచ్చి నివాళులర్పించారు. చివరగా సైనికుడ్ని చితి పేర్చి దహనం చేసే సమయంలో అతని భార్య మడకం తూలే భర్త మరణాన్ని తట్టుకోలేక..కట్టెలపై పేర్చిన భర్త చితిపైనే పడుకొని బోరున విలపించింది. తాను ప్రాణత్యాగానికి సిద్దపడింది. ఐతే గ్రామస్తులు ఆమెకు పలువిధాలుగా నచ్చజెప్పారు. భర్తను తలుచుకుంటూ రోదిస్తున్న దృశ్యం అందర్ని కలిచివేసింది.
కుటుంబ సభ్యులను వదిలి.. ఊరికి దూరంగా.. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ నిర్వహించే జవాన్ల సేవలు వెలకట్టలేనివి. ఇక అలాంటి సైనికులకు కుటుంబ సభ్యులతో విడదీయరాని సంబంధం ఉంటుంది. మడకం లఖ్ము అత్యున్నత త్యాగం అతని గ్రామం మొత్తాన్ని గర్వించేలా చేసింది. “షహీద్ జవాన్ అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు, బంధువులు అతనికి కన్నీటి కళ్లతో వీడ్కోలు పలికారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..