దేశ నడిబొడ్డులో అమానుషం.. పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని దళిత వరుడిపై అగ్రవర్ణాల దాడి

|

May 11, 2023 | 5:54 PM

తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు పెళ్లి సందర్భంగా గుర్రం ఎక్కడం, ఊరేగింపుగా వెళ్లడం..

దేశ నడిబొడ్డులో అమానుషం.. పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని దళిత వరుడిపై అగ్రవర్ణాల దాడి
Dalit Groom Attacked For Riding Horse
Follow us on

తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు పెళ్లి సందర్భంగా గుర్రం ఎక్కడం, ఊరేగింపుగా వెళ్లడం అగ్రవర్ణాల వారు జీర్ణించుకోలేకపోయారు. అంతే వరుడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అనంతరం వధువును కూడా వేధించారు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహల్లా ప్రాంతంలో మే 4 రాత్రి దళిత వర్గానికి చెందిన అజయ్ కుమార్ (22) పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఈ సందర్భంగా వరుడిని గుర్రంపై ఊరేగిస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అగ్రవర్ణాలకు చెందిన 20-25 మంది వరుడిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం గుర్రంపై నుంచి కిందికి లాగి కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదారు. మండపంలో ఉన్న మహిళల మీద కూడా అగ్రవర్ణాల పురుషులు దాడి చేసి వేధించారు. ఈ ఘటనపై వరుడి అత్త గీతాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అల్లుడిపై ఠాకూర్లు దాడి చేశారని పోలీసులకు తెల్పింది. వారంతా తమను కులం పేరుతో దూషిస్తూ, దళితులు అంటూ తిట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. మా ఊరిలో దళిత పెళ్ళికొడుకులు గుర్రాలు ఎక్కరు, నీకు ఎంత ధైర్యం?’ అంటూ దాడికి దిగారని తన ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా పెళ్లిలో విద్యుత్ సరఫరాను మూడు-నాలుగు సార్లు ఆపేసినట్లు గీత ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

దీనిపై పోలీస్ అధికారి నీరజ్ శర్మ మాట్లాడుతూ.. యోగేష్ ఠాకూర్, రాహుల్ కుమార్, సోనూ ఠాకూర్, కునాల్ ఠాకూర్‌లతో పాటు పలువురు వ్యక్తులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుల్లో రాహుల్‌ని మాత్రమే అరెస్ట్ చేశామని, మిగతావారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.