క్యాన్సర్ విద్యార్థిని ఎగతాళి చేసిన కూతురికి తండ్రి రెండు అప్షన్స్.. సెల్ వదులుకో.. లేదా గుండు చేసుకో..కూతురు ఏ శిక్ష ఎంచుకుందంటే

|

Aug 21, 2021 | 1:42 PM

Father Punishment: భారత దేశంలో పిల్లల పెంపకం ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భిన్నమని చెప్పవచ్చు. ఇప్పుడంటే చిన్న కుటుంబాలు, హాస్టల్ జీవితాలు ఉంటున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం

క్యాన్సర్ విద్యార్థిని ఎగతాళి చేసిన కూతురికి తండ్రి రెండు అప్షన్స్.. సెల్ వదులుకో.. లేదా గుండు చేసుకో..కూతురు ఏ శిక్ష ఎంచుకుందంటే
Father Punishment
Follow us on

Father Punishment: భారత దేశంలో పిల్లల పెంపకం ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భిన్నమని చెప్పవచ్చు. ఇప్పుడంటే చిన్న కుటుంబాలు, హాస్టల్ జీవితాలు ఉంటున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఉమ్మడి కుటుంబాలు.. పెద్దల పట్ల పిల్లలకు భయం భక్తి ఉండేవి.. పిల్లలు తప్పు చేస్తే..నానీ అనే బేధం లేకుండా దండించేవారు. ఇక ఉపాధ్యాయులు కూడా తమ స్టూడెంట్స్ ను క్రమ శిక్షణలో పెట్టడానికి బెత్తం పట్టిన సందర్భాల గురించి మన పెద్దవారు చెబుతుంటే వింటున్నాం కూడా అయితే మారుతున్నకాలంతో పాటు.. మనిషి జీవన విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిల్లో ఒకటి పిల్లలను తల్లిదండ్రులే కాదు, టీచర్స్ కూడా దండించరాదు. అయితే విదేశాల్లో పిల్లల పెంపకం విభిన్నంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఎప్పుడూ ఏ తప్పు చేసినా దండించరాదు. అలా చేసే శిక్షార్హము.. ఇక పిల్లలకు భయం చెబితే.. వారిని నెటిజన్లు విమర్శిస్తారు. అయితే వీటన్నిటి భిన్నంగా ఓ తండ్రి తన కూతురుమంచి చెడుల గురించి అనుభవ పూర్వంగా తెలిసిరావాలని వేసిన శిక్షణను సర్వత్రా పొగుడుతున్నారు. తన 16ఏళ్ల కూతురికి గుండు చేసిన తండ్రిని సమర్థిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ప్లోరిడాకు చెందిన దంపతులు విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల బాధ్యతను మాత్రం.. తల్లిదండ్రులుగా ఇద్దరూ తీసుకున్నారు. దీంతో ,మాజీ భార్య కూతురికి తండ్రి గార్డియన్ గా ఉన్నాడు. అయితే అతని కూతురు.. తనతో పాటు స్కూళ్లో చదువుకునే తోటి విద్యార్థిని శారీరకంగా హింసకు గురు చేసింది. తోటి విద్యార్థి కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నా అయ్యో పాపం అంటూ.. మానవత్వంతో మెలగకుండా శారీరకంగా హింసించింది. క్యాన్సర్ బాధితురాలి జుట్టుంతా రాలిపోయింది. అయితే ఆ అమ్మాయి పట్ల జాలీప్రేమ కలిసి ఉండాల్సింది బదులు.. ఈ 16ఏళ్ల అమ్మాయి తోటి స్నేహితురాలిని పదేపదే వేధింపులు, ఎగతాళి చేస్తోంది. అంతేకాదు.. జుట్టు కోల్పోయిన బాధిత బాలిక తలపై విగ్ ను కూడా లాగిపారేసింది.

అయితే ఈ విషయం తెలిసిన తండ్రి.. కూతురుకి మంచి చెడులు చెప్పాలనుకున్నాడు. తన కూతురు చేసిన పనిని తప్పు అంటూ వివరించే ప్రయత్నం చేశాడు. పద్దతి మార్చుకుని క్యాన్సర్ బాధితురాలితో ప్రేమగా ఉండు అని చెప్పాడు. అయితే కూతురు తన ప్రవర్తన మార్చుకోలేదు.. హింసించడం పెరిగిపోయింది. దీంతో కూతురుకి గుండు గీసి శిక్షించాలనుకున్నాడు.

అయితే తండ్రి.. గుండు గీసే ముందు రెండు ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి తన సెల్ ఫోన్లు, అన్నింటిని వదులుకోవాలని.. ఇంకెప్పుడు తిరిగి ఇవ్వనని తేల్చి చెప్పాడు ఇక సెకండ్ ఆప్షన్ గుండు చేయించుకోవాలన్నాడు. ఏదికావాలతో ఎంచుకో అంటే.. కూతురు సెల్ ఫోన్ వదులుకోలేక గుండె గీయించుకోవడానికి అంగీకరించింది. దీంతో తండ్రి రేజర్ తో కూతురుని నున్నగా గుండె చేశాడు. అయితే తండ్రి చేసిన పనిని యధావిధిగా రెండు వర్గాలుగా విడిపోయి మరీ నెటిజన్లు వాదిస్తున్నారు. కొందరు తండ్రి. పిల్లల పట్ల ప్రేమనే కాదు.. అవసరమైతే వారిని సక్రమైన దారిలో పెట్టేందుకు కొన్నిసార్లు కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం ఉందని అంటే.. మరికొందరు గుండె గీసేపద్ధతి కాకుండా వేర్ ఆప్శన్ చూడాల్సింది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Karimnagar Quadruplets: కరీంనగర్‌లో ఒకే క్యాన్పులో నలుగురు శిశువులు జననం.. తల్లిపిల్లలు క్షేమం..(photo fallery)