Chennai Airport: ఇద్దరు మహిళల అతితెలివి.. అడ్డంగా బుక్ చేసిన కస్టమ్స్ అధికారులు.. రూ. 70 కోట్ల విలువైన..

|

Jun 04, 2021 | 8:14 PM

Chennai Airport: అధికారులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ మాఫియా మాత్రం తగ్గడం లేదు. అనేక జిత్తులు, ఎత్తులు వేస్తూ డ్రగ్స్‌ను..

Chennai Airport: ఇద్దరు మహిళల అతితెలివి.. అడ్డంగా బుక్ చేసిన కస్టమ్స్ అధికారులు.. రూ. 70 కోట్ల విలువైన..
Heroin
Follow us on

Chennai Airport: అధికారులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ మాఫియా మాత్రం తగ్గడం లేదు. అనేక జిత్తులు, ఎత్తులు వేస్తూ డ్రగ్స్‌ను దేశ విదేశాలకు అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. కొన్నికొన్ని సార్లు పట్టిబడినప్పుడు భారీ మొత్తంలో డ్రగ్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మరి పట్టుబడని డ్రగ్స్ ఇంకెంత స్థాయిలో దేశాలు దాటుతున్నాయో. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. విదేశాలను భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శుక్రవారం నాడు జోహెన్నస్‌బర్గ్ నుంచి చెన్నై వచ్చిన ఇద్దరు విదేశీ మహిళా ప్రయాణికుల వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడిన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ 9.87 కేజీలు ఉంటుందని, దీని విలువ విదేశీ మార్కెట్‌లో సుమారు రూ. 70 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరు సప్లయ్ చేస్తున్నారు వంటి వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Zodiac Signs: మీరు విజయవంతం కావడానికీ మీ రాశికి సంబంధం ఉంటుంది..ఎలానో తెలుసుకోండి..