Paddy Farming: రైతన్నకు ఊరట..! ఇక బంజరు భూమిలోనూ బంగారం లాంటి దిగుబడి..

|

Jun 14, 2023 | 11:20 AM

సారవంతమైన భూమిలో ఈ రకం దిగుబడి హెక్టారుకు 65 క్వింటాళ్లు. అదే సమయంలో, బంజరు భూమిలో దాని దిగుబడి హెక్టారుకు 40 నుండి 42 క్వింటాళ్లు అవుతుంది. విశేషమేమిటంటే ఈ రకం వరి వ్యాధి నిరోధకతను ఎక్కువగా కలిగి ఉంటుంది. వరిలో వచ్చే వ్యాధులు, తెగుళ్ల దాడిని సులువుగా తట్టుకోగలదు.

Paddy Farming: రైతన్నకు ఊరట..! ఇక బంజరు భూమిలోనూ బంగారం లాంటి దిగుబడి..
Paddy Farming
Follow us on

జూలై 15 తర్వాత రైతులు వరి నాట్లు ప్రారంభిస్తారు. అయితే, రైతులు సారవంతమైన భూమిలో మాత్రమే వరి వేస్తారు. అటువంటి పరిస్థితిలో బంజరు భూమి ఉన్న రైతులు వరి సాగుకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంజరు భూమి ఉన్న రైతుల కోసం శాస్త్రవేత్తలు వరిలో కొత్త రకాలను అభివృద్ధి చేశారు. ఇక దీంతో ఇప్పుడు బంజరు భూమిలో కూడా సాగు చేయవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో ఈ రకాల అభివృద్ధి కారణంగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఎందుకంటే, యూపీలో 13 లక్షల హెక్టార్లకు పైగా భూమి బంజరు భూమిగానే ఉంది. కిసాన్ తక్ నివేదిక ప్రకారం, సెంట్రల్ సాయిల్ లవణీయత పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు అటువంటి 4 రకాల వరిని అభివృద్ధి చేశారుక. వీటిని బంజరు భూమిలో కూడా సాగు చేయవచ్చు. ఈ వరి రకాలను ప్రవేశపెట్టడంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో వరిసాగు విస్తీర్ణం పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో పాటు వరి దిగుబడి కూడా పెరుగుతుందన్నారు.. ఈ రకాల్లో ఒకదాని పేరు CSR-36. బంజరు భూమిలో సీఎస్‌ఆర్‌-36 సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

దేశంలో మొత్తం 37.6 లక్షల హెక్టార్ల భూమి బంజరుగా ఉంది. ఈ భూముల్లో రైతులు వ్యవసాయం చేయడం చాలా అరుదు. విశేషమేమిటంటే యూపీలోని ప్రతి జిల్లాలో బంజరు భూమి ఉంది. 9.8 పీహెచ్‌ విలువ ఉన్న భూమిలో కూడా సీఎస్‌ఆర్‌-36 రకాన్ని పండించవచ్చని సెంట్రల్‌ సాయిల్‌ లవణీయత పరిశోధన సంస్థ శాస్త్రవేత్త రవికిరణ్‌ చెబుతున్నారు. ఈ రకం వరి మొక్కల పొడవు 100 నుండి 110 సెం.మీ వరకు ఉంటుంది. దీని పంట 130 నుండి 135 రోజులలో సిద్ధంగా ఉంటుంది.

CSR-36 రకం వరి గింజలు పొడవుగా, సన్నగా ఉంటాయి. సారవంతమైన భూమిలో CSR-36 రకం దిగుబడి హెక్టారుకు 65 క్వింటాళ్లు. అదే సమయంలో, బంజరు భూమిలో దాని దిగుబడి హెక్టారుకు 40 నుండి 42 క్వింటాళ్లు అవుతుంది. విశేషమేమిటంటే CSR-36 రకం వ్యాధి నిరోధకతను ఎక్కువగా కలిగి ఉంటుంది. వరిలో వచ్చే వ్యాధులు, తెగుళ్ల దాడిని సులువుగా తట్టుకోగలదు. ఈ రకమైన వరి విత్తనాలు సంస్థ లక్నో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు ఈ రకం వరి సాగుతో వ్యవసాయం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..