గణిత శాస్త్ర మేధావి శేషాద్రి కన్నుమూత

ప్రముఖ గణిత శాస్త్ర మేధావి సీఎస్ శేషాద్రి చెన్నైలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. గణిత శాస్త్రవేత్తలో ఆయన ప్రముఖ స్థానాన్ని అలంకరించారు. ఆల్జిబ్రిక్ జామెంట్రీలో నిష్ణాతులు. ఆయన ఈ విభాగంలో..

గణిత శాస్త్ర మేధావి శేషాద్రి కన్నుమూత

Edited By:

Updated on: Jul 19, 2020 | 6:06 AM

ప్రముఖ గణిత శాస్త్ర మేధావి సీఎస్ శేషాద్రి చెన్నైలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. గణిత శాస్త్రవేత్తలో ఆయన ప్రముఖ స్థానాన్ని అలంకరించారు. ఆల్జిబ్రిక్ జామెంట్రీలో నిష్ణాతులు. ఆయన ఈ విభాగంలో అనేక నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. 1988లో ప్రఖ్యాత రాయల్‌ సొసైటీ ఫెలోగా శేషాద్రి ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌లో 2010లో ఫారిన్‌ అసోసియేట్‌గా కూడా సెలక్ట్‌ అయ్యారు. గణితశాస్త్రంలో చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం 2009లో ఆయనకు పద్మవిభూషణ్‌ అవార్డు ప్రదానం చేసింది. శేషాద్రి మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. దేశం గొప్ప గణిత మేధావిని కోల్పోయిందని, ఆయన సేవలను భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.