పారామిలటరీ దళాల ఎక్స్‌గ్రేషియా పెంపు.. అమరవీరుల కుటుంబాలకు రూ.35 లక్షలు.. ఇంకా ఈ ప్రయోజనాలు..

|

Nov 24, 2021 | 9:44 PM

CRPF Increased EX Gratia: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరణించిన జవాన్ల కుటుంబాలకు అందించే ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని పెంచింది. ఇక నుంచి వారి కుటుంబాలకు

పారామిలటరీ దళాల ఎక్స్‌గ్రేషియా పెంపు.. అమరవీరుల కుటుంబాలకు రూ.35 లక్షలు.. ఇంకా ఈ ప్రయోజనాలు..
Crpf
Follow us on

CRPF Increased EX Gratia: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరణించిన జవాన్ల కుటుంబాలకు అందించే ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని పెంచింది. ఇక నుంచి వారి కుటుంబాలకు రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం యుద్ధంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.21.5 లక్షలను పెంచామని ఇప్పుడు రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని పారామిలటరీ అధికారులు తెలిపారు. .

ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 25 లక్షలు
అదేవిధంగా సర్వీస్‌లో ఉన్నప్పుడు ప్రమాదం, ఆత్మహత్య లేదా అనారోగ్యం వంటి ఇతర కారణాల వల్ల మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.16.5 లక్షలకు బదులుగా రూ.25 లక్షలు అందజేయనున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన పారామిలటరీ దళం పాలకమండలి వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఎక్స్-గ్రేషియా చెల్లింపులు రెండు హెడ్‌ల కింద (రిస్క్ ఫండ్ మరియు సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్) ఫోర్స్ సిబ్బంది చేసే స్వచ్ఛంద విరాళాల నుంచి తీసుకుంటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) లేదా పారామిలటరీ బలగాల్లో కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

అమరవీరుడి కుమార్తె, సోదరి వివాహానికి సహాయం పెంపు
అమరవీరుడి కుమార్తె లేదా సోదరి వివాహం కోసం కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పెంచింది. ఈ సాయం మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచినట్లు తెలిపారు. CRPF దళం దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం. ఇందులో దాదాపు 3.25 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ప్రధాన అంతర్గత భద్రతా దళంగా నియమించారు. ఈ భద్రతా దళాలను కశ్మీర్ లోయలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో నక్సల్ వ్యతిరేక విధులకు ఉపయోగిస్తున్నారు.

CAT 2021 Exam: CAT పరీక్ష కోసం IIM మార్గదర్శకాలు విడుదల.. ఈ విషయాలను గుర్తుంచుకోండి

Navy MR Admit Card 2021: ఇండియన్‌ నేవీ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?