పాములు పట్టుకునేందుకు నేరస్తులు..! సర్ప యాప్‌పై ఫిర్యాదుల వెల్లువ.. ఎక్కడ..? ఏంటీ..?

|

Nov 29, 2022 | 7:48 AM

పాము దొరికిన తర్వాత సమాచారాన్ని GPS-ప్రారంభించబడిన యాప్‌లో ఫీడ్ చేస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా స్నేక్‌ క్యాచర్‌లు ఈ యాప్‌తో పని చేస్తున్నారు.

పాములు పట్టుకునేందుకు నేరస్తులు..! సర్ప యాప్‌పై ఫిర్యాదుల వెల్లువ.. ఎక్కడ..? ఏంటీ..?
Sarpa App
Follow us on

పాములు తరచూ నివాస ప్రాంతాల్లోకి చొరబడి హల్‌చల్‌ చేస్తుంటాయి. అలా దారితప్పి వచ్చిన పాములను పట్టుకుని సురక్షితంగా అడవుల్లోకి పంపేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకించి ఓ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. అదే సర్ప యాప్‌. అయితే, ఇప్పుడు ఈ సర్ప యాప్పై సర్వత్రా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న పలువురు పాములను పట్టుకునేందుకు తమ పేర్లను నమోదు చేసినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు జారీ చేస్తున్న క్రమంలో కన్నూర్ జిల్లాలో పాము పట్టేవారి లిస్ట్‌లో పేరు నమోదు చేసుకున్న వ్యక్తులు గతంలో పాము విషాన్ని కలిగి అరెస్టయిన వ్యక్తి కూడా ఉండటంతో స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇక సర్ప యాప్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..పాము దొరికిన తర్వాత సమాచారాన్ని GPS-ప్రారంభించబడిన యాప్‌లో ఫీడ్ చేస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా స్నేక్‌ క్యాచర్‌లు ఈ యాప్‌తో పని చేస్తున్నారు. అయితే, ఇక్కడ పనిచేసే స్నేక్‌ క్యాచర్లు ఎటువంటి నేర నేపథ్యం కలిగి ఉండరాదని, క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉండకూడదనేది నియమం. కానీ ఒక్క కన్నూర్ జిల్లాలోనే 43 మంది స్నేక్‌ క్యాచర్స్‌లో ముగ్గురు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఇందులో పాము విషాన్ని కలిగి ఉన్నందుకు ప్రస్తుతం విచారణలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు. అడవి పంది మాంసాన్ని ఆహారంగా తీసుకున్న మరో ఫారెస్ట్ వాచర్ బెయిల్‌పై విడుదలై ప్రస్తుతం రక్షకుడిగా పనిచేస్తున్నాడు. మరో రక్షకుడు యువతిని అపహరించి చిత్రహింసలకు గురిచేశాడు. ఇలాంటి వారిని ఎంపిక చేసుకోవటం మరింత ప్రమాదకరమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంధించిన పామును అసలు అడవిలోకి వదలకుండా విషాన్ని సేకరించి విక్రయించే వారిలో కొందరు స్నేక్‌ క్యాచర్లు ఉన్నారని ఆరోపించారు. లైసెన్సు ఇచ్చే సమయంలో నిశిత పరిశీలన ఉండాలన్నది ఈ రంగంలో పనిచేస్తున్న వారి డిమాండ్. ప్రస్తుతం క్రిమినల్ కేసుల్లో ఉన్న వారిని వెంటనే జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి