కర్నాటకలో కంగనా రనౌత్ పై క్రిమినల్ కేసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కర్ణాటకలోని తుమ్ కూర్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలయింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఆమె ఈ నెల 20 న ట్వీట్ చేసింది..

కర్నాటకలో కంగనా రనౌత్ పై క్రిమినల్ కేసు

Edited By:

Updated on: Sep 26, 2020 | 5:41 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కర్ణాటకలోని తుమ్ కూర్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలయింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఆమె ఈ నెల 20 న ట్వీట్ చేసింది. ఈ బిల్లులను అర్థం చేసుకున్నవారు వీటి గురించి తెలియనివారికి వివరించాలని, అలాకాక, నిద్ర పోతున్నట్టు నటిస్తూ అర్థమైనప్పటికీ  అర్థం కాలేదన్నట్టు వ్యవహరించేవారిని ఏమనాలని ఆమె ప్రశ్నించింది. అలాంటి వారు టెర్రరిస్టులు కాక మరేమవుతారని ఆమె వ్యాఖ్యానించింది. సవరించిన పౌరసత్వ చట్టం వల్ల ఒక్కరి పౌరసత్వం కూడా రద్దు కాలేదని, కానీ వారు (విపక్షాలు, ఆందోళనకారులు) రక్తాన్ని ప్రవహింపజేశారని కంగనా పేర్కొంది.  విపక్షాలతో బాటు రైతులను కూడా ఆమె ఉగ్రవాదులుగా ఆరోపించింది.