CoWIN Crashed: ప్రారంభమైన టీకా రిజిస్ట్రేషన్‌.. పోర్టల్‌ క్రాష్‌.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

|

Apr 28, 2021 | 5:40 PM

CoWIN Crashed: కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయసు.

CoWIN Crashed: ప్రారంభమైన టీకా రిజిస్ట్రేషన్‌.. పోర్టల్‌ క్రాష్‌.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
Follow us on

CoWIN Crashed: కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయసు గలవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో 18-45 ఏళ్ల మధ్య ఉన్న వారికి టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం అవకాశం కల్పించింది. అయితే బుధవారం సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్ యాప్-పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ ల సర్వర్‌లు అన్నీ క్రాష్ అయ్యాయి. సర్వర్లో సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్‌ కావడానికి ప్రయత్నించగా, సర్వర్‌ క్రాష్‌ అయ్యింది. అయితే సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ కావడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధిక సర్వర్ లోడ్ కారణంగా సాయంత్రం 4 గంటలకు కోవిన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఒకేసారిగా అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకునేందుకు అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందు కోసం కొవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు, ఉమాంగ్‌ యాప్‌లలో తప్పనిసరిగా ముందస్తుగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు ఇస్తారని పేర్కొంది. ఆ నమోదు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అందుబాటులోకి వచ్చింది. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్‌ ఉంటుందని కేంద్రం తెలిపింది.

 

 

 

ఇవీ చదవండి:

Sputnik V: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మే 1న భారత్ లో అందుబాటులోకి..వెల్లడించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌

Vaccination: ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి టీకా అప్పుడే కాదు.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి