
Vaccine Certificate: దేశంలో ఒక వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా వ్యాక్సిన్ తీసుకునే సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. లేకపోతే ఆయా దేశాలు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొవిన్ పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసింది. పాస్‌పోర్టుకు కరోనా టీకా ధ్రువపత్రాన్ని జత చేసేలా వీలు కల్పించింది. మీ టీకా సర్టిఫికేట్‌లో పాస్‌పోర్టు నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు అంటూ ఆరోగ్యసేతు అధికారిక ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించింది.
► ముందుగా కొవిన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి.
► తర్వాత కస్టమర్ వివరాల దగ్గర రైజ్ యాన్ ఇష్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది.
► పాస్ పోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేసి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ఎవరి సర్టిఫికేట్‌ను లింక్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.
► పాస్‌పోర్టు నెంబర్‌ణు నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి.
► ఒకవేళ టీకా సర్టిఫికేట్‌లోని పేరు పాస్‌పోర్టులోని పేరుతో సరిపోలకపోతే ఎండిట్ చేసే సదుపాయం కూడా ఉంది.
► పాస్‌పోర్టు నెంబర్ ఎంటర్ చేయడం, పేరు మార్చుకునే సదుపాయం ఒక్కసారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకే సబ్‌మిట్ చేసే ముందే తప్పులు లేవని నిర్ధారించుకోవాలి. అప్పుడే ఎలాంటి ► ఇబ్బందులు తలెత్తవు. చీటికి మాటికి ఎడిట్ చేస్తామంటే కుదరదు.
కాగా, కొవిన్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్య, ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు, భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు టీకా సర్టిఫికేట్‌ను పాస్‌పోర్టులకు అనుసంధానించుకోవాలని కేంద్రం సూచించింది.