India Corona: కనికరించని కరోనా.. లక్షన్నరకు చేరువలో యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే?

|

Jul 21, 2022 | 10:46 AM

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 20 వేలలోపే నమోదైన రోజువారీ కేసులు నిన్న (జులై20) 21 వేలు దాటాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవ్వడం కాస్త ఆందోళన కలిగిస్తోంది..

India Corona: కనికరించని కరోనా.. లక్షన్నరకు చేరువలో యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే?
India Corona
Follow us on

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 20 వేలలోపే నమోదైన రోజువారీ కేసులు నిన్న (జులై20) 21 వేలు దాటాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవ్వడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ (Corona Bulletin) ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,07,360 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 21,566 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,38,25,185కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 45 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 5,25,870కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,881 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇది మొత్తం కేసుల్లో 0.34 శాతం.

ఇదిలా ఉంటే కరోనా రికవరీలు పెరుగుతుండడం కాస్త సానుకూలాంశంగా భావించవచ్చు. బుధవారం 18,294 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,31,50,434కి చేరుకోగా.. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. ఇక కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 29.12 లక్షల కొవిడ్‌ డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు 200.91 కోట్లు కరోనా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..