Covid19 Updates: ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. మొన్నటివరకు 15 వేల్లోపే నమోదైన కేసులు ఇప్పుడు 20 వేలకు పైగా చేరువవుతున్నాయి. ఈక్రమంలో నిన్న కూడా భారీగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,673 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,40,19,811 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,43,676 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. దేశంలోకరోనా పాజిటివిటీ రేటు 98.5 శాతంగా ఉంది. ఇక నిన్న 39 మంది కొవిడ్ కారణంగా మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5,26, 357 కి చేరింది.
కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,955 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కొవిడ్ రికవరీల సంఖ్య 4,33,49, 778 కు చేరింది. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. నిన్న సుమారు 31 లక్షల మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన కరోనా డోసుల సంఖ్య 204.25 కోట్లు దాటింది.