Health ministry Releases Revised Guidelines: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రుల్లో చేర్చుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
A suspect case (of COVID-19) shall be admitted to the suspect ward of CCC, DCHC or DHC as the case may be. No patient will be refused services on any count. This includes medications such as oxygen or essential drugs even if the patient belongs to a different city:Health Ministry
— ANI (@ANI) May 8, 2021
కాగా, శుక్రవారం హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 10 రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా180 జిల్లాల్లో గత వారంరోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గత 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేదని ఆ ప్రకటనలో తెలిపింది. 54 జల్లాల్లో అయితే గత మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేదని వెల్లడించింది.
Read Also…కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించే తేనెటీగలు, నెదర్లాండ్స్ లో శిక్షణ నిస్తున్న రీసెర్చర్లు,