Coronavirus: మే 17న అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు.. వెల్లడించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌

|

May 11, 2021 | 6:22 AM

Coronavirus: కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా వ్యాప్తిస్తోంది. ఇక కర్ణాటకలోని బెంగలూరులో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడం..

Coronavirus: మే 17న అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు.. వెల్లడించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌
Follow us on

Coronavirus: కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా వ్యాప్తిస్తోంది. ఇక కర్ణాటకలోని బెంగలూరులో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మే 17వ తేదీన బెంగళూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అధికారులు వెల్లడించారు. కేసుల తీవ్రత వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్‌ 11వ తేదీ వరకు కేసులు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించిన అధికారులు.. ఈ సమయంలో 14 వేల మంది మరణించే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు.
కాగా, కర్ణాటకలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. కరోనా తీవ్రత దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. గత 10 రోజులుగా విధించినజనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో కర్ణాటక సర్కార్‌ లాక్‌డౌన్‌ విధించింది. ఉదయం 6 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్‌.. మే 24 తేదీ వరకు కొనసాగనుంది.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,930 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 490 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 18,776కు పెరిగింది. ప్రస్తుతం 5,64,485 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్లపై యుద్ధం కోసం మరో వ్యాక్సిన్ అవసరం లేదు..ఇవి సరిపోతాయి..వెల్లడించిన బయోఎన్టెక్