ఉత్తరప్రదేశ్ లో మొదటిసారిగా మంగళవారం కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 7,336 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 30 తరువాత ఇలా గణనీయంగా తగ్గడం ఇది తొలి సారని, 24 గంటల్లో 282 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ అధికారి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. రికవరీ రేటు 91.4 శాతం ఉండగా యాక్టివ్ కేసుల సంఖ్య 1.87 లక్షలకు తగ్గిందని ఆయన చెప్పారు. గత ఏప్రిల్ 30 న 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.55 కోట్ల టెస్టులు నిర్వహింఛామని, దేశంలో ఇన్ని టెస్టులు నిర్వహించిన రాష్ట్రం యూపీయేనని ఆయన చెప్పారు. నేడు 2.99 లక్షల టెస్టులు జరిపామని అన్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ప్రజలకు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. కాగా రానున్న రోజుల్లో కోవిద్ కేసుల సంఖ్య ఇంకా తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు.
అటు గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాపించకుండా చూసేందుకు ‘గ్రామ్ నిగానీ సమితులను’ ఏర్పాటు చేశామని, ఇవి ఎప్పటికప్పుడు గ్రామాల్లో శానిటైజేషన్ వంటి పనులను చేపడుతున్నామని ఆయన వివరించారు. మొత్తం 21, 742 గ్రామాలను కోవిద్ వైరస్ సోకని గ్రామాలుగా గుర్తించామని ప్రసాద్ చెప్పారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, రాష్ట్రం మొత్తం మీద ప్రస్తుతం గ్రామాలపై ఫోకస్ పెటట్టామని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరణాల సంఖ్య కూడా తగ్గవలసి ఉందని ఆయన చెప్పారు. అందువల్ల తమ అధికారులు దీనిపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : బాతు పిల్లలతో మొసలి స్నేహం.. వైర్యం లేని స్నేహబంధం ఆకట్టుకుంటున్న వీడియో : Viral Video