కేరళలో కోవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. అయితే వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందన్నారు. ఒక్క రోజులోనే నాలుగు లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారని, రాష్ట్రానికి తక్కువగా వ్యాక్సిన్ అందుతోందని ఆమె చెప్పారు. మా స్టేట్ లో ఇంకా 50 శాతం మందికి పైగా ప్రజలు టీకామందు తీసుకోవలసి ఉందని, ఏమైనా ఈ కోవిడ్ పాండమిక్ ను అదుపు చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆమె అన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన వ్యూహమే కారణమన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చేరిన రోగుల డేటాను ఎవరైనా పరిశీలించుకోవచ్చునన్నారు. ఎవరికీ బెడ్స్ కొరత గానీ, ఆక్సిజన్ కొరత గానీ లేదని ఆమె చెప్పారు. మరి కోవిడ్ పరిస్థితి తగ్గినట్టు కాదా అన్నారు. రెండు వారాల క్రితం కేంద్రం నుంచి ఓ బృందం ఇక్కడికి వచ్చి పలు జిల్లాలను, ఆస్పత్రులను విజిట్ చేసిందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిందని వీణా జార్జి చెప్పారు. పైగా పలువురు నిపుణులు, వైరాలజిస్టులు కూడా ఆ బృందంతో సమావేశమై పరిస్థితిని సమీక్షించి ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు.
అయితే కేరళలో నిన్న 20,772 కోవిడ్ కేసులు నమోదు కాగా 116 మంది రోగులు మరణించారు. పాజిటివిటీ రేటు 13 శాతానికి పైగా పెరిగింది. ఈ నెల 29 నాటికి దేశంలో నమోదైన 50శాతం కేసుల్లో ఈ రాష్ట్ర కేసులే అత్యధికంగా ఉన్నాయి. కేరళకు మళ్ళీ నిపుణుల బృందాన్ని పంపుతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ నిన్నగాక మొన్న తెలిపారు. ఆ రాష్ట్రంలో ఈ ఇన్ఫెక్షన్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై వీణా జార్జి స్పందించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు