AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: కరోనా బాబోయ్ కరోనా.! ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.?

ఎన్ని వేరియంట్లు.. ఎన్ని వేషాలు.. ఎన్ని చావులు.. ఎన్ని ఆవేదనలు.. ఇప్పటికీ కరోనా కల్లోలం నుంచి ప్రపంచం బయటపడలేదు. ఇప్పుడు మళ్లీ కొవిడ్ కలకలం మనదేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. కేసులే కాదు మరణాలు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోసారి 2019నాటి పరిస్థితులు రాబోతున్నాయా.. అన్న ఆందోళన మరింత భయపెడుతోంది. కరోనాకు పుట్టుక తప్ప చావులేదు అన్నట్టుగా దాని వేరియంట్ల విశ్వరూపం జనంపై విరుచుకుపడుతోంది.

Corona: కరోనా బాబోయ్ కరోనా.! ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.?
Corona
Ravi Kiran
|

Updated on: May 31, 2025 | 7:31 PM

Share

కరోనా ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో నాలుగు వేరియంట్లు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆరోగ్యశాఖ డేటా చూస్తే వెన్నులో వణుకుపుడుతోంది. గతంలో ఎప్పుడూ దాని ప్రబావం డిసెంబర్-జనవరి..ఫిబ్రవరి.మార్చిలో ఉండేది. కానీ ఇప్పుడు వానాకాలంలో కరోనావిరుచుకుపడడం మరింత ఆందోళనపరుస్తోంది. వింటర్ సీజన్ అంటే విషజ్వరాలు విరుచుకుపడే కాలం. అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తుండడం..మరింత భయపెడుతోంది. అంతెందుకు నిన్న 1828 కేసులుండగా…కేవలం 24గంటల్లో 685 కేసులు నమోదయ్యాయి. ఈరేంజ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఆరోగ్యశాఖ డేటా ప్రకారం కేసులు 4వేలకు చేరువవుతున్నాయి. ఇప్పటివరకు 26మంది చనిపోయారు. అత్యధికంగా కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కొవిడ్ ఉధృతి పెరుగుతోంది. ఎక్కువగా జనసాంద్రత ప్రాంతాల్లో వేగంగా వేరింట్లు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు.

మే నెల మొత్తంలో, 15 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారే ఉన్నారని వైద్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. అయినప్పటికీ, కేసుల పెరుగుదల మరణాల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వైద్యశాఖ డేటాలో నమోదువారి సంఖ్య కూడా గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఖ్య యాక్టివ్ కేసులతో పోలిస్తే గణనీయంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కుగానే ఉంది. ఏపీలో 17కేసులుండగా..తెలంగాణలో మూడు కేసులు ఉన్నాయి. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. అయితే ఏపీలోని ఏలూరులో కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఐదుగురు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాలుగురోజుల కిందట శాంతినగర్‌లో ఇద్దరు వృద్ధులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరికీ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎలూరు కలెక్టరేట్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. మాస్కులు పెట్టుకోనిదే ఆఫీసులకో అలౌవ్ లేదని అధికారులు అనౌన్స్ చేశారు. అలాగే కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా సిబ్బందిని అలర్ట్ చేసింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అలర్ట్ అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ రోజువారీ కేసులను పర్యవేక్షిస్తోంది. ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేస్తోంది. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రజలు దీనిపై మరింత ఆందోళన పడాల్సిన అవసరంలేదని..గతంలో ఉన్నంత డేంజర్ సిట్చువేషన్స్ ఇప్పుడులేదని చెబుతున్నారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..