Flights: విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే!

|

Sep 29, 2021 | 5:50 AM

International Flights: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభించగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్న..

Flights: విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే!
Follow us on

International Flights: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభించగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమర్షియల్‌ విమాన సర్వీసుల రద్దును అక్టోబర్‌ 31 వరకూ కొనసాగించనున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. కార్గో విమానాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని రూట్లలో మాత్రం ప్రయాణికుల విమానాలు నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేయగా.. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తూ దశలవారీగా సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్‌ నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌, మాల్దీవులు, నెదర్లాండ్స్‌, జర్మనీ, ఖతార్‌ సహా దాదాపు 25 దేశాలతో భారత ప్రభుత్వం విమాన సర్వీసులు నడిపేందుకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా దేశాలకు నడవనున్నాయి.

కాగా, కోవిడ్‌ నేపథ్యంలో అన్ని రవాణాలతో పాటు విమానాలను సైతం నిషేధించింది. ఒక వైపు లాక్‌డౌన్‌, కఠినమైన ఆంక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా ప్రస్తుతం భారత్‌లో పాజిటివ్‌ కేసుల భారీగానే తగ్గుముఖం పట్టాయి. దేశంలో అన్ని రంగాలు తెరుచుకుని తమతమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, విమాన సర్వీసులు మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా మరోసారి విమానాల రద్దు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది డీజీసీఏ.

ఇవీ కూడా చదవండి:

Covid Deaths: కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!

Cyclone Gulab: అల్పపీడనంగా మారిన గులాబ్‌ తుఫాన్‌.. మధ్య భారతాన్ని వదలని భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం