COVID-19 second wave: వైద్యులపై కరోనా సెకండ్ వేవ్ పంజా.. 244 మంది మృత్యువాత.. ఒక్క రోజులో..

| Edited By: Ram Naramaneni

May 18, 2021 | 8:39 AM

Coronavirus second wave:దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు

COVID-19 second wave: వైద్యులపై కరోనా సెకండ్ వేవ్ పంజా.. 244 మంది మృత్యువాత.. ఒక్క రోజులో..
Doctors
Follow us on

Coronavirus second wave:దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. అయితే కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులు ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కోవిడ్‌పై పోరు సాగిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ముందుండి సేవలందిస్తున్నారు. అయితే.. కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడుతున్న క్రమంలో వైద్యులు కూడా ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కరోనా కారణంగా గతేడాది దేశవ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. సెకండ్ వేవ్‌లోనూ ఈ మహమ్మారి వైద్యులపై పంజా విసురుతోందని పేర్కొంది.

అయితే.. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క రోజులో 50 మంది వైద్యులు మరణించారని మెడికల్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు భారత వైద్య సంఘం వెల్లడించింది. అత్యధికంగా బిహార్‌లో 69 మంది, ఉత్తర్ ప్రదేశ్‌లో 34, ఢిల్లీలో 27, ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 19, మహారాష్ట్ర 13, తమిళనాడు 10, కర్ణాటకలో 8, ఒడిశాలో 8, మధ్యప్రదేశ్ 5, ఛత్తీస్‌గఢ్ 3, జమ్మూ కాశ్మీర్లో 3, అస్సాం, గుజరాత్, హర్యానా, కేరళలో ఇద్దరిద్దరు చొప్పున, గోవాలో ఒకరు కరోనా సెకండ్‌ వేవ్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ తెలిపింది. మృతుల్లో 25 ఏళ్ల నుంచి 87 ఏళ్ల వయసుగల వైద్యులు ఉన్నారని తెలిపింది.

 

Also Read:

Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్