కరోనా సెకండ్ వేవ్ విజృంభణ.. భారీగా నమోదవుతున్న కొత్త కేసులు.. ఆ ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్..

|

Mar 09, 2021 | 12:02 PM

Maharashtra Lockdown: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వేగంగా వ్యాప్తి చెందుతోంది...

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ.. భారీగా నమోదవుతున్న కొత్త కేసులు.. ఆ ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్..
Follow us on

Maharashtra Lockdown: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో అధికారులు పాక్షికంగా లాక్‌డౌన్ ప్రకటించారు. కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో థానేలోని పౌర పరిపాలన శాఖ మార్చి 13 నుండి 31 వరకు 11 హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ మేరకు థానే మున్సిపల్ కమిషనర్ విపిన్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో అమలులో ఉన్న అన్ని ఆంక్షలు ఈ సమయంలో కూడా అమలులో ఉంటాయని వెల్లడించారు. (Lockdown In Thane)

ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం నాటికి, థానేలో కోవిడ్ కేసులు 2,69,845కి చేరుకున్నాయి. అంతేకాకుండా వైరస్ కారణంగా 6,302 మంది మరణించారు. అటు మహారాష్ట్రలో కొత్తగా 8,744 కరోనా కేసులు నమోదు కాగా, 22 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 22,28,471కి చేరింది. గత మూడు రోజులలో ఏకంగా 10,000 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, అటు ముంబైలో పాజిటివ్ కేసులు అదుపులోకి రాకపోతే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని మంత్రి అస్లాంషేక్ అన్నారు.

(Thane Lockdown News)

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!