Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు.. కోవిడ్ ప్రోటోకాల్స్‌తో..

|

Jan 10, 2022 | 6:52 PM

Parliament Budget Session 2022: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. నిత్యం వేలాదిగా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్‌లో సాధారణ ప్రజలతోపాటు

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు.. కోవిడ్ ప్రోటోకాల్స్‌తో..
Follow us on

Parliament Budget Session 2022: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. నిత్యం వేలాదిగా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్‌లో సాధారణ ప్రజలతోపాటు ఉద్యోగులు సైతం కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 400 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 31 నుంచి జరగాల్సిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు నిర్వహిస్తోంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించాలంటూ ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌కు ఇరు సభాపతులు ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో తొలుత ఫోన్లో మాట్లాడి అనంతరం సెక్రటరీ జనరల్‌కు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలిచ్చారు.

కోవిడ్-19 ప్రొటోకాల్ అమలుపై సమీక్ష అవసరమని లోక్‌సభ, రాజ్యసభ సభాపతులు భావించారు. గత శీతాకాల సమావేశాల్లోనూ ఉభయ సభలు కోవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. 2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించాయి. సభా సమయంలో ఉభయ సభలు, పబ్లిక్ గ్యాలరీలో ఎంపీలను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ పూర్తిగా అమలు చేశారు. 2021 బడ్జెట్ సెషన్ తొలి అర్థభాగంలోనూ ఇదే పద్ధతి అమలు చేశారు.

ఆ తర్వాత జరిగిన సెషన్లలో సాధారణ పద్ధతిలో ఉభయ సభలు ఏకకాలంలో జరిగాయి. అయితే ఆయా సభల్లో పబ్లిక్ గ్యాలరీలోనూ సభ్యులను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ అమలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఏ పద్ధతిలో నిర్వహించాలన్న అంశంపై సమీక్ష జరిపి నిర్ణయించాలని సెక్రటరీ జనరల్స్‌కు ఉభయ సభాపతులు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంట్ దృష్టిసారించింది.

Also Read:

Harish Rao: అదే కేసీఆర్ ఘనత.. ఆ బీజేపీ రాష్ట్రంలో రైతుబంధు, బీమా ఎందుకులేవు.. మంత్రి హరీశ్ రావు

Omicron Alert: థర్డ్ వేవ్‌లో ఆ అవసరం 5-10 శాతం మందికే.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం