India Corona: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

|

Dec 07, 2021 | 9:51 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్..

India Corona: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?
India Corona
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భయాందోళనకు గురిచేస్తోంది. కాగా.. గడిచిన 24 గంటల్లో (సోమవారం) దేశవ్యాప్తంగా 6,822 కేసులు నమోదయ్యాయి. 558 రోజుల తర్వాత కేసుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 220 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 95,014 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏడాదిన్నర తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. డైలీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉంది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,48,383 కి చేరగా.. మరణాల సంఖ్య 4,73,757 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 10,004 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,79,612 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 128.76 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశంలో 64.94 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Vijayawada: విజయవాడపై నీలి చిత్రాల నీడలు.. వెలుగులోకి కీలక విషయాలు.. మరో ఐదుగురిపై కేసు

Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..