
భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ ఇబ్బందులను సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 40 వేలు దాటాయి. దాదాపు 9 నెలల తర్వాత యాక్టివ్ కేసులు బాగా పెరిగాయి. దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ వైరస్ తీవ్ర సంక్షోభం సృష్టిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కేరళలోనే 14,506 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీని తర్వాత మహారాష్ట్రలో 4875, ఢిల్లీలో 2876 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో మరణాల రేటు కూడా పెరుగుతోంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ రేటు కూడా పెరుగుతోంది. ఢిల్లీలో ఇన్ఫెక్షన్ల రేటు దాదాపు 26 శాతం గా నమోదవుతుంది. గత వారంలో ఈ రేటు 20 శాతానికి తగ్గడం లేదు. మూడు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిందని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరగడానికి ఇదే కారణం.
కొత్త వేరియంట్‌ల రాక, ప్రజల నిర్లక్ష్యం కూడా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూ వేవ్ అడుగు పెట్టనున్నదా..!
మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ ధాల్ కోవిడ్ గురించి సమాచారాన్ని అందించారు. Omicron కొత్తవేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ ధల్ వివరించారు. XBB.1.16 ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. దీంతో కేసులు పెరిగిపోతున్నాయి..అయితే ఈ వైరస్ వలన పెద్ద ప్రమాదం లేదు.. అయినప్పటికీ టీకాలు వేయడం చాలా మంచిది. వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, కేసులు పెరిగినా, మరణాల రేటు పెరగదని చెప్పారు.
కోవిడ్ కేసుల పెరుగుదల ఎప్పుడూ ఆందోళన కలిగించదని డాక్టర్ ధాల్ చెప్పారు. ఈ సమయంలో ప్రజలు ఈ వైరస్ గురించి ఆలోచించాలి. నిర్లక్ష్యం తగదని చెప్పారు. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ల వాడకం తప్పనిసరి.
మరికొన్ని రోజులు కేసులు పెరిగే అవకాశం ఉంది
రానున్న కొద్దిరోజుల పాటు దేశంలో కేసులు పెరుగుతాయని ఢిల్లీలోని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో, వైరస్ జనాభాలో 70 నుండి 80 శాతానికి చేరుకోనంత వరకు.. పెరుగుతూనే ఉంటాయి. అయితే భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, కేసులు పెరుగుతూనే ఉంటాయి. కోవిడ్ లక్షణాలు సాధారణ వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి. జలుబు, దగ్గు తప్ప మరేమీ ప్రమాదం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..