Maharashtra: మహారాష్ట్రలో మరో 15 రోజులు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

|

Apr 28, 2021 | 11:04 PM

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు..

Maharashtra: మహారాష్ట్రలో మరో 15 రోజులు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Follow us on

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే ప్రకటించారు. కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్‌ ఈ నెల 14 నుంచి జనసంచారం, ఇతర కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం తోపే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొంత మేర కొవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుత ఆంక్షలను పొడిగించేందుకే మంత్రులంతా మొగ్గుచూపినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజువారీ కేసులు 60 వేలుగా ఉన్నాయి.  ఇంతకుముందు రోజువారీ కేసులు 70 వేలు దాటే అవకాశం ఉందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ఇకపై కేసులు మరింత తగ్గుతాయని ఆశిస్తున్నాం.. అని మంత్రి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కొందరు కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

Telangana Corona: తెలంగాణ కరోనా కేసులపై హోంశాఖ మంత్రి సమీక్ష.. లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి కరోనా పరీక్షలు.. నెగెటివ్‌ నిర్ధారణ.. వైద్యుల వెల్లడి

Adar Poonawalla: సీరం ఇనిస్టిట్యూట్‌ అధినేత అధర్‌ పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు: కేంద్ర హోంశాఖ ప్రకటన