Corona Virus: మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా.. మెడికల్ కాలేజీలో 25 స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ

|

May 07, 2022 | 10:29 AM

Corona Virus: దేశంలో గత కొన్ని రోజులుగా అదుపులో ఉన్న కరోనా మళ్లీ వ్యాప్తిస్తోంది. పలు ప్రాంతాల్లో క్రమంగా కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులోని..

Corona Virus: మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా.. మెడికల్ కాలేజీలో 25 స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ
Tamil Nadu
Follow us on

Corona Virus: దేశంలో గత కొన్ని రోజులుగా అదుపులో ఉన్న కరోనా మళ్లీ వ్యాప్తిస్తోంది. పలు ప్రాంతాల్లో క్రమంగా కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులోని (Tamilandu) IIT-మద్రాస్ ఇన్స్టిట్యూట్ తర్వాత మరొక విద్యా సంస్థలో కోవిడ్ 19 (COVID-19 )కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మెడికల్ కాలేజీ హాస్టల్ లో భారీగా కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

చెంగల్‌పట్టు జిల్లాలోని తిరుప్పోరూరు సమీపం నెల్లికుప్పంలోని సత్యసాయి వైద్యకళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణయింది. సత్యసాయి మెడికల్ కాలేజీ హాస్టళ్లలోని ఏడుగురికి మే 3న పాజిటివ్‌గా నిర్ధారణయింది. వారిని ఐసోలేషన్‌కు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం 39మందిని పరీక్షించారు. వారిలో 18 మంది విద్యార్థులకు పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో చేపడుతున్న నియంత్రణ చర్యలను శుక్రవారం ఆరోగ్యశాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, కలెక్టర్‌ రాహుల్‌నాధ్‌, ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్‌ బి.బరణీధరన్‌తో కలిసి పరిశీలించారు.

బాధితులు 25 మందిలో 10 మంది బాలుర హాస్టల్‌లో, ఎనిమిది మంది బాలికల హాస్టల్‌లో ఉన్నారు. క్లస్టర్  వెలుగులోకి వచ్చిన అనంతరం ఆరోగ్య శాఖ హాస్టళ్లలోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించారు. బాలుర హాస్టల్‌లో 439 మంది, బాలికల హాస్టల్‌లో 530 మంది విద్యార్థులు ఉన్నారు. బాధితుల్లో ప్రధానంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరు ఏప్రిల్ 22 , 23 తేదీల్లో కళాశాలలో చేరారు. వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు చెందినవారు.

పాజిటివ్‌గా తేలిన వారందరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ఆరోగ్యం స్థిరంగా ఉందని, మిగిలిన వ్యక్తులను పరీక్షిస్తున్నామని ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. క్లస్టర్ కంట్రోల్ ప్రోటోకాల్ అమలులో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Kashi Tour: వారణాసికి వెళ్తున్నారా.. విశ్వనాథుడి దర్శనంతో పాటు.. ఈ 5 పనులు చేయండి.. లేదంటే మీ పర్యటన ప్రయాణం అసంపూర్ణం

Tirumala: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి వారపు సేవలకు తాత్కాలికంగా బ్రేక్..