Mamata Banerjee: బెంగాల్‎లో కొలిక్కి రాని సీట్ల సర్ధుబాటు.. కాంగ్రెస్ పై సీఎం మమత కీలక వ్యాఖ్యలు

బెంగాల్‌లో మాకు కాంగ్రెస్ అవసరమే లేదన్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్‌కు అంతగా బలంగా ఉందని భావిస్తే.. వారణాసిలో పోటీ చేసి ప్రధాని మోదీని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ మాత్రం తృణమూల్‌తో పొత్తు ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీఎంసీ.. కాంగ్రెస్ పార్టీని మరోసారి గట్టిగా టార్గెట్ చేసింది.

Mamata Banerjee: బెంగాల్‎లో కొలిక్కి రాని సీట్ల సర్ధుబాటు.. కాంగ్రెస్ పై సీఎం మమత కీలక వ్యాఖ్యలు
Cm Mamata Banerjee

Updated on: Feb 02, 2024 | 9:41 PM

బెంగాల్‌లో మాకు కాంగ్రెస్ అవసరమే లేదన్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్‌కు అంతగా బలంగా ఉందని భావిస్తే.. వారణాసిలో పోటీ చేసి ప్రధాని మోదీని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ మాత్రం తృణమూల్‌తో పొత్తు ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీఎంసీ.. కాంగ్రెస్ పార్టీని మరోసారి గట్టిగా టార్గెట్ చేసింది. పొత్తుల్లో భాగంగా బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మరోసారి కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన కామెంట్స్ చేశారు. తాము బెంగాల్‌లో 2 రెండు సీట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ కాదంటోందని.. అలాంటప్పుడు రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 300 సీట్లలో పోటీ చేస్తే.. 40 సీట్లు కూడా గెలుస్తారని తాను అనుకోవడం లేదని మమత కామెంట్ చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండానే బెంగాల్‌కు వచ్చారని పరోక్షంగా రాహుల్ గాంధీ యాత్ర గురించి ప్రస్తావించారు. అధికారుల ద్వారానే తనకు దీని గురించి సమాచారం వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు సత్తా ఉంటే యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీని ఓడించాలని సూచించారు. వారణాసిలో ప్రధాని మోదీని ఓడించాలని అన్నారు. టీ స్టాల్స్ దగ్గర ఫోటో షూట్స్ చేయడానికి వచ్చారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు. అయితే కాంగ్రెస్ మాత్రం తృణమూల్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో ఆశాజనకంగానే ఉంది. ఎక్స్‌లో విడుదల చేసిన వీడియోలో దీనిపై స్పందించారు రాహుల్ గాంధీ. బెంగాల్‌లో తాము పొత్తులు లేవని చెప్పడం లేదని.. మమతా బెనర్జీ కూడా ఆ విషయం చెప్పడం లేదని అన్నారు. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని అన్నారు. మొత్తానికి బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటుకు మమత సుముఖంగా లేకపోవడంతో..ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..