Coronavirus cases in India: ఎండమిక్ దశలో కోవిడ్.. 2020 మార్చి తర్వాత కనిష్ఠ స్థాయికి కేసుల సంఖ్య.. పూర్తి వివరాలు

|

Jun 21, 2023 | 1:13 PM

India Covid News: దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లుగా వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ..వీరిలో 4.44 కోట్ల మంది ప్రాణాంతక వైరస్ బారినుంచి కోలుకున్నారు. అధికారిక గణాంకాల మేరకు దేశంలో కోవిడ్-19 వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,31,898గా ఉంది.

Coronavirus cases in India: ఎండమిక్ దశలో కోవిడ్.. 2020 మార్చి తర్వాత కనిష్ఠ స్థాయికి కేసుల సంఖ్య.. పూర్తి వివరాలు
Covid-19
Follow us on

India Covid News: యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి మన దేశంలో ఎండమిక్ దశకు చేరుకుంది. దేశంలో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖంపడుతున్నాయి. మంగళవారంనాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కోవిడ్ గణాంకాల మేరకు.. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా కేవలం 36 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా మహమ్మారి మొదలైన 2020 మార్చి తర్వాత నమోదైన కనిష్ఠ కేసుల సంఖ్య ఇదే కావడం విశేషం. అయితే మంగళవారం (జూన్ 20)నాడు స్వల్పంగా పెరిగి.. 92 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,844 నుంచి 1,786కు తగ్గినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇక దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లుగా వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ..వీరిలో 4.44 కోట్ల మంది ప్రాణాంతక వైరస్ బారినుంచి కోలుకున్నారు. అధికారిక గణాంకాల మేరకు దేశంలో కోవిడ్-19 వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,31,898గా ఉంది. అలాగే దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కరోనా బాధితుల్లో మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 220.66 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.

కోవిడ్ ఎండమిక్ దశకు చేరినప్పటికీ.. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, చిన్నారులకు కోవిడ్ వైరస్ ప్రాణాంతకంగా పరిణమిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కోవిడ్ విషయంలో మరికొంతకాలం పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కూడా సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి

దేశంలో కోవిడ్-19 ఎండమిక్ దశకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే చివరి దశలోనూ కొత్త వేరింట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి దేశంలో పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. కొత్త స్ట్రెయిన్, వేరియంట్లను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..