Coronavirus: కరోనా కలకలం.. నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌

|

Jan 02, 2022 | 3:04 PM

Coronavirus: కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా వెలుగు చూసి గత రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ తదితర ఆంక్షల కారణంగా తగ్గుముఖం..

Coronavirus: కరోనా కలకలం.. నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌
Follow us on

Coronavirus: కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా వెలుగు చూసి గత రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ తదితర ఆంక్షల కారణంగా తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ విజృంభిస్తోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళన కలిగిస్తుండగా, కరోనా మహమ్మారి కూడా మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇక తాజాగా ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా నైనిటాల్‌ జిల్లాలోని సుయల్‌బరి సమీపంలో ఉన్న గంగార్‌కోట్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి 85 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం విద్యార్థులంతా అసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 96 మంది విద్యార్థులకు కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.

పాజిటివ్‌ తేలిన విద్యార్థులకు వైద్య బృందం పరిశీలిస్తోంది. పాఠశాలలో 70శాతం వరకు విద్యార్థులు జ్వరం, దగ్గు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రత్యేక వైద్య సిబ్బంది వచ్చి విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో శానిటేజేషన్‌ చేయిస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అలాగే సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారి 85 మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో నవోదయ విద్యాలయాన్ని మైక్రో మెయింటెనెన్స్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. ఐసోలేషన్‌లో ఉన్న విద్యార్థులను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు:
కాగా, ఉత్తరాఖండ్‌లో ఒమిక్రాన్‌ కూడా మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతోంది. శనివారం ఒక్కరోజు నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. ఇప్పటికి నలుగురు ఒమిక్రాన్‌ బారిన పడి కోలుకున్నారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 11న ఒక కేసు నమోదు కాగా, డిసెంబర్‌ 27న మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. శనివారం మరో నాలుగు కేసులు నమోదు కావడం అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్‌ కేసులు పెరగకుండా ఉత్తరాఖండ్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Omicron Effect: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో స్కూల్స్ బంద్.. కొత్త కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన స్టాలిన్ ప్రభుత్వం!

France Covid: ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 2 లక్షల కొత్త కేసులు.. ఆంక్షలు కఠినతరం చేసిన సర్కార్